E-Paper
Advertisement

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్
Advertisement

Maa Nanna Super Hero : టాలీవుడ్ లో ఉన్న యంగ్ టాలెంటెడ్ హీరోలలో సుధీర్ బాబు కూడా ఒకరు. గత కొన్నాళ్ల నుంచి ఈ హీరో హిట్ కోసం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాతో దసరా సందర్భంగా థియేటర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు సుధీర్ బాబు. అయితే ఈ సినిమా విషయంలో సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. సినిమాను రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సుధీర్ బాబు డేరింగ్ స్టెప్…

Advertisement

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, సీనియర్ నటులు షాయాజీ షిండే, సాయి చంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. క్యామ్ ఎంటర్టైన్మెంట్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు జైక్రిష్ సంగీతాన్ని అందించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 11న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా, ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉందంటూ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా స్టోరీ మొత్తం ఒక కొడుకు, ఇద్దరు తండ్రుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ లో చెప్పేసారు మేకర్స్. ఇక ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరగగా, మరోవైపు మేకర్స్ కూడా మూవీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో రిలీజ్ కంటే రెండు రోజుల ముందే పలు ప్రాంతాల్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లను చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సాధారణంగా పెయిడ్ ప్రీమియర్స్ ను సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనే గాని ప్లాన్ చేయరు. ఒకవేళ ఇలా చేయాల్సి వచ్చినా మూవీ రిలీజ్ కి కొన్ని గంటల ముందు చేస్తే సేఫ్ అని ఫీల్ అవుతారు. కానీ సుధీర్ బాబు మాత్రం ఏకంగా రెండు రోజుల ముందే ఇలా పెయిడ్ ప్రీమియర్స్ కు రెడీ అవ్వడం చూస్తుంటే మూవీ తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లను హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలలో ఈరోజు వేయబోతున్నారు. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Advertisement

సినిమా హిట్టా ఫట్టా నిర్ణయించేది అదొక్కటే…

‘మా నాన్న సూపర్ హీరో’ మూవీకి ఇప్పటికే ట్రైలర్, టీజర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఒక స్పెషల్ పోస్టర్ ను క్రియేట్ చేసి పలువురు సెలబ్రిటీల వెనక నిలబడి ప్రాంక్ లాగా చేసిన ప్రమోషన్ స్ట్రాటజీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమా హిట్ కావాలంటే ఇదొక్కటే సరిపోదు. ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ రావాలి. ఈ పాజిటివ్ టాక్ మాత్రమే మూవీ సక్సెస్ ను నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. మరి ఈరోజు ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ప్రీమియర్ల తర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×