E-Paper
Advertisement

July OTT Movies and Web Series Release: ఈ నెలలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే.. మీర్జాపూర్ 3 కూడా..

July OTT Movies and Web Series Release: ఈ నెలలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే.. మీర్జాపూర్ 3 కూడా..
Advertisement

July OTT Movies and Web Series Release: ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీలకే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. అందువల్లనే ప్రముఖ ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక గత నెల జూన్‌లో చాలా సినిమాలు అండ్ సిరీస్‌లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహాతో సహా మరిన్ని ఓటీటీ సంస్థలు సినీ ప్రియులను అలరించాయి.

ఇక నిన్నటితో జూన్ నెల ముగియడంతో జూలైలో ఎలాంటి సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలోకి వస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందించబోతున్నాం. ఈ జూలై నెలలో చాలా సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. అందులో ది బెస్ట్ సిరీస్‌ అయిన మీర్జాపూర్ సీజన్ 3 కూడా ఉంది. మరి ఈ నెలలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మహారాజా

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా నటించేందుకు ముందుంటాడు. ఇటీవల ఈ హీరో ‘మహారాజ’ అనే కొత్త సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత నెల జూన్ 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించి అదరగొట్టేసింది. తమిళం, తెలుగు భాషల్లో తన హవా చూపించింది. ఇక థియేటర్లలో అదరగొట్టేసిన ఈ సినిమా ఈ నెలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. జూలై మూడో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

Also Read: 40 ఏళ్ళ క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా మొదలు పెట్టారు.. కానీ: ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి

మీర్జాపూర్ సీజన్ 3

ఎంతో మంచి ఆడియన్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సిరీస్ ‘మీర్జాపూర్ 3’. ఈ సిరీస్ నుంచి వచ్చిన మీర్జాపూర్ సీజన్ 1 అండ్ 2 సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మీర్జాపూర్ సీజన్ 3 సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూలై 5న ఈ సీజన్ 3 సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

మనమే

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ‘మనమే’. ఇటీవలే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ జూలై నెలలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇంకా వెల్లడికాలేదు.

కకుడా

ఆదిత్య సర్పోర్ట్‌దార్ దర్శకత్వం వహించిన కకుడా సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రితేశ్ దేశ్‌ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ సినిమా జూలే 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

శశిమథనం

Also Read: పుష్ప2 రిలీజ్ డేట్ వాయిదా.. అదే డేట్ లాక్ చేసుకున్న విక్రమ్ తంగలాన్.. కొత్త పోస్టర్ రిలీజ్

పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సిరీస్ శశిమథనం. వినోద్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జూలై 4న ఓటీటీ ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

వైల్డ్ వైల్డ్ పంజాబ్

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 10న గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, జెస్సీగిల్, మనోజ్ సింగ్ వంటి నటీ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సిమ్రాన్‌ప్రీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

మలయాళీ ఫ్రమ్ ఇండియా

ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకున్న మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్‌లో జూలై 5నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×