BigTV English

Mahesh Babu: చెప్పలేని కాంట్రవర్సీల కారణంగా మహేష్ తో మూవీ వద్దనుకున్న రేణు దేశాయ్..

Mahesh Babu: చెప్పలేని కాంట్రవర్సీల కారణంగా మహేష్ తో మూవీ వద్దనుకున్న రేణు దేశాయ్..

Mahesh Babu: రేణు దేశాయ్.. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అవ్వాలి అని ఎంటర్ అయిన ఈ భామ హీరోయిన్గా కంటే కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ పరిచయం. బద్రి సినిమాతో అందాలు ఆరబోసి అందరి మనసులు దోచుకున్న రేణు ఆ తరువాత తిరిగి పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాలో నటించింది.2000 లో పార్థిబన్ హీరోగా నటించిన జేమ్స్ పాండు అనే తమిళ్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రేణు ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి సినిమాలో నటించింది.


అయితే తమాషాగా ఆ చిత్రం సమయంలోనే పవన్ రేణుకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద చర్చకు దారి తీసిన విషయం. బద్రి మూవీ తర్వాత రేణు తిరిగి 2003లో పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాలో మాత్రం నటించింది. విచిత్రం ఏమిటంటే 2004లో ఇద్దరికీ పెళ్లి కూడా కాకముందే పెద్ద కొడుకు అకీరా నందన్ పుట్టాడు. ఇది కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇక ఆ తర్వాత 2009 జనవరి 28న పెద్దల సమక్షంలో పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. సజావుగా సాగుతున్న వీరి సంసారం లో తలెత్తిన మనస్పర్ధలు కారణంగా 2011లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి రేణు తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటూ వస్తుంది. ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోబోతున్నట్లు నిశ్చితార్థం కూడా చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినప్పటికీ ఎందుకో రేణు ఆ పెళ్లి రద్దు చేసుకుంది.


ఇక టైగర్ నాగేశ్వరరావు మూవీ తో రేణు దేశాయ్ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ మెయిన్ లీడ్ లో నటించిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రేణు దేశాయ్ సంఘసంస్కర్త హేమలత లవణం పాత్ర పోషించారు. ప్రమోషన్ ఈవెంట్స్ లో చురుకుగా పాల్గొన్న రేణు తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాటిలో ఒకటే మహేష్ బాబు తో కలిసి మూవీ చేసే సంగతి.

పవన్ కళ్యాణ్ తో పెళ్లి అయిన తర్వాత నుంచి ఒక్క సినిమా కూడా చేయని రేణు తిరిగి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి సినిమాలో నటించారు. ఆమెను స్క్రీన్ పైన చూసిన ప్రేక్షకులు ఓ రేంజ్ లో థియేటర్లలో అరిచి గోల పెట్టారు. ఈ మూవీలో ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో ఇంతకుముందు తనకు వచ్చిన మూవీ ఆఫర్ గురించి చెప్పిన విషయం బాగా వైరల్ అయింది.

అసలు మొదట సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం రేణు దేశాయ్ కు వచ్చిందట. అదేనండి బ్యాంక్ ఆఫీసర్గా నదియా చేసిన క్యారెక్టర్ ఉంది కదా మొదట దానికి రేణు దేశాయ్ ను అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.. దాంతో ఆ చాన్స్ నదియా కు దక్కింది. అయితే అప్పట్లో ఆ విషయాల గురించి వెల్లడించని రేణు ఇప్పుడు ఆ విషయం గురించి “ఆ మూవీ ఎందుకు సెట్ కాలేదు అనే విషయాన్ని మాత్రం నేను చెప్పలేను. ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం చెప్పాలని నాకు ఉంది కానీ మళ్ళీ కాంట్రవర్సీలు ఎదుర్కొనే ఓపిక లేదు.. అందుకే కామ్ గా ఉన్నాను”అంటూ అసలు సంగతి మాత్రం చెప్పకుండా దాని వెనక ఏదో పెద్ద సీక్రెట్ ఉంది అన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×