E-Paper
Advertisement

Mahesh Babu: లాంగ్ హెయిర్ తో బాబు ముంబైకి.. అందుకోసమేనా.. ?

Mahesh Babu: లాంగ్ హెయిర్ తో బాబు ముంబైకి.. అందుకోసమేనా.. ?

Mahesh Babu: గుంటూరు కారం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ మొత్తాన్ని మార్చేస్తున్నాడు. లాంగ్ హెయిర్, గడ్డం, ఫిజిక్ తో మంచిగా రెడీ అవుతున్నాడు. ఇక ఈ లుక్ బయటకు రాకుండా ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒకచోట మహేష్.. కెమెరా కంటికి చిక్కుతున్నాడు.

తాజాగా నేడు మహేష్.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముంబై వెళ్తూ కనిపించాడు. మహేష్ తో పాటు నమ్రత కూడా కనిపించింది. మొన్నటివరకు ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న మహేష్.. సడెన్ గా ముంబైకి ఎందుకు వెళ్తున్నాడబ్బా.. ? అది కూడా ఈ లుక్ లో అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు కూడా అంబానీ పెళ్ళికి వెళ్తున్నట్లు సమాచారం.

నేడు ముంబైలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ పెళ్ళికి హాలీవుడ్, బాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరుకానున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే రామ్ చరణ్ దంపతులు ఈ పెళ్ళికి హాజరుకావడానికి నిన్ననే ముంబైకి చేరుకున్నారు.

ఇక ఇప్పుడు మహేష్ కూడా ఈ గ్రాండ్ మ్యారేజ్ కు అటెండ్ కావడానికే వెళ్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు.. వైలెట్ కలర్ టీ షర్ట్, లాంగ్ హెయిర్, గడ్డంతో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పెళ్ళిలో సాంప్రదాయ మైన దుస్తుల్లో.. ఈ లాంగ్ హెయిర్ తో మహేష్ ఎలా ఉండనున్నాడో చూడాలి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×