BigTV English
Advertisement

Athadu Movie: అతడు సినిమా డిలీట్ డైలాగ్ విన్నారా… పెట్టి ఉంటే రచ్చ అయ్యేదేనే?

Athadu Movie: అతడు సినిమా డిలీట్ డైలాగ్ విన్నారా… పెట్టి ఉంటే రచ్చ అయ్యేదేనే?

Athadu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా వీరిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో అతడు(Athadu) సినిమా ఒకటి. 2005వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా త్రిష (Trisha)నటించి ప్రేక్షకులను మెప్పించారు.


మహేష్ బర్త్ డే స్పెషల్…

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు.. ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ 4k వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా ఈ సినిమా మరోసారి వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాలో కొన్ని డిలీట్ సన్నివేశాలు డిలీట్ డైలాగులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


చర్చిలో జరిగిన సన్నివేశం..

సాధారణంగా సినిమాలలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను అలాగే డైలాగులను డిలీట్ చేస్తూ ఉంటారు. ఆ సన్నివేశాలు డైలాగులు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలవల్ల వాటిని సినిమా నుంచి తొలగించి విడుదల చేస్తూ ఉంటారు. అనంతరం డిలీట్ చేసిన సన్నివేశాలను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అతడు సినిమాకి సంబంధించి ఒక డిలీట్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన డైలాగులను అందించిన విషయం తెలిసిందే. అయితే క్లైమాక్స్ సన్నివేశంలో మహేష్ బాబు సోనుసూద్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది.

ఇలా వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో సోను సూద్ గన్ చేతిలో పట్టుకొని నీలాంటి మంచివాడు ఈ భూమిపై ఉండకూడదు అంటూ మహేష్ బాబుని కాల్చడానికి ప్రయత్నిస్తే అదే తుపాకి నుంచి బుల్లెట్ కాకుండా గోలి వెనుక వైపుగా వెళ్లి సోనుసూద్ తలకు తగలడంతో అతను కింద పడిపోతాడు. అప్పుడు మహేష్ బాబు నీలాంటి చెడ్డవాళ్ళు బ్రతికుండడం ఈయనకు కూడా ఇష్టం లేదు అంటూ ఒక డైలాగ్ చెబుతాడు. ఇక ఈ సన్నివేశం చర్చిలో జరుగుతూ ఉంది. మహేష్ బాబు ఈ డైలాగ్ చెప్పగానే చర్చ్ లో గంట కూడా మోగుతుంది. అయితే చర్చిలో దేవుడు గురించి మహేష్ బాబు ఇలాంటి డైలాగ్ చెప్పడంతో ఈ డైలాగ్ కుల మతాల మధ్య విభేదాలను సృష్టిస్తుందన్న నేపథ్యంలోనే దీనిని తొలగించారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రీ రిలీజ్ సమయంలో అయినా ఈ డైలాగు పెడితే బాగుంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి డిలీట్ చేసిన ఈ డైలాగ్ తిరిగి యాడ్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×