E-Paper
Advertisement

Mahesh Babu: వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్.. మహేష్ పోస్ట్ వైరల్

Mahesh Babu: వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్.. మహేష్ పోస్ట్ వైరల్

Mahesh Babu: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు వేసిన విషయం తెల్సిందే. కేవలం 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉందని.. నిర్దాక్షిణ్యంగా ఆమెను ఫైనల్ నుంచి తప్పించారు. దీంతో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెస్తుంది అని భావించిన భారతీయుల గుండెలు బాధతో నిండిపోయాయి.

ఇక వినేశ్ ఫోగాట్ కు అండగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా నిలబడుతున్నారు. ఆమెకు ధైర్యం చెప్తూ సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇప్పటికే సమంత, తాప్సీ లాంటి హీరోయిన్స్.. వినేశ్ ఫోగాట్ కు ధైర్యం చెప్తూ పోస్టులు చేశారు. తాజాగా మహేష్ బాబు సైతం ఆమెకు అండగా నిలబడ్డాడు. వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్ అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

” నేటి ఫలితంతో పట్టింపు లేదు, కానీ మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనమే. వినేశ్ ఫోగాట్.. మీ హృదయం నిజమైన ఛాంపియన్ అని మీరు అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం మరియు బలం మా అందరికీ స్ఫూర్తినిస్తాయి. పతకం వచ్చిందా లేదా అని కాదు, మీ స్ఫూర్తి మాలో.. ప్రతి ఒక్కరిలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మహేష్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి సారి ఈ కాంబో తెరపై కనిపించనుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×