BigTV English

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అనర్హత.. స్పందించిన బ్రిజ్ భూషణ్ కుమారుడు

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అనర్హత.. స్పందించిన బ్రిజ్ భూషణ్ కుమారుడు

Vinesh phogat disqualified news(Sports news in telugu): పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు చేరుకున్న వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడంతో దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులతో పాటు ఎంతో మంది ఆమెకు సపోర్టు చేస్తూ ట్వీట్‌‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై బ్రిజ్ భూషణ్ కుమారుడు, బీజేపీ ఎంపీ శరణ్ భూషణ్ సింగ్ బుధవారం స్పందించారు. ఆమె అనర్హత దేశానికి తీవ్ర నష్టం అని అన్నారు. అంతే కాకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ దీనిని పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.


ఉత్తర ప్రదేశ్ కైసర్‌గంజ్ లోక్‌సభ సభ్యుడైన శరణ్ ఆపార్టీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడు. రెజ్లింగ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ అయిన బ్రిజ్ భూషణ్‌‌పై ఏడాది క్రితం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. బ్రిజ్ భూషణ్‌‌ మైనర్స్‌తో సహా చాలా మంది మహిళలా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్‌తో పాటు పలువురు ఆరోపించారు. ఢిల్లీలోని రెజ్లర్ల నిరసనలకు వీరు నాయకత్వం వహించారు.

ఇదిలా ఉంటే మరో వైపు లైంగిక వేదింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. అయితే కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల క్రింద ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత బ్రిజ్ భూషణ్ మిత్రుడైన సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే 2016 రియో గేమ్స్ లో కాంస్య పతక విజేత అయిన సాక్షి మాలిక్ దీనికి నిరసనగా రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యారు.


Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×