E-Paper
Advertisement

Mahesh Babu: 50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్

Mahesh Babu: 50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్
Advertisement

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఘట్టమనేని కృష్ణ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం మహేష్ కు కన్నీళ్లు మిగులుస్తూ కృష్ణ స్వర్గస్తులు అయిన విషయం తెల్సిందే. ప్రతి విషయంలోనూ తోడుగా నిలబడే తండ్రి పక్కన లేకపోవడంతో మహేష్ కృంగిపోయాడు. ఇక ఆయన లేనిలోటును అభిమానులు తీరుస్తున్నారు. ఈ విషయాన్నీ మహేష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. సమయం వచ్చినప్పుడల్లా మహేష్.. తండ్రి కృష్ణను తలుచుకుంటూనే ఉంటాడు.

ఇక నేటితో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్.. మరోసారి తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. ఎక్స్ వేదికగా అల్లూరి సీతారామరాజు పోస్టర్ ను షేర్ చేస్తూ.. ” అల్లూరి సీతారామరాజుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి.. ఇప్పటికీ ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు నాన్నగారి గంభీరమైన స్క్రీన్‌ ప్రజెన్స్ ను చూసి ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. నటుడిగా నా ప్రయాణంపై మరియు తెలుగు సినిమాపై దాని ప్రగాఢమైన ప్రభావాన్ని నేను గుర్తుచేకుంటూనే ఉంటాను” అంటూ రాసుకొచ్చాడు.

Advertisement

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 1974లో విడుదలైన విడుదలైన అల్లూరి సీతారామరాజు.. అప్పట్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశాడు. అంతేకాదు ఈ సినిమాను నిర్మించింది కూడా కృష్ణనే. అప్పట్లో ఇదొక పెద్ద రికార్డ్.

అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు ఎన్టీఆర్ స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫలయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించాడు. ఇప్పటివరకు ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ లను ఎవరు బ్రేక్ చేయలేదు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×