Sukrithi Veni: డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి అరుదైన గౌరవాన్ని అందుకుంది. చిన్న వయస్సులోనే ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ పురస్కారం అందుకుంది. సుకృతి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్తమనటన ప్రదర్శించినందుకు గాను ఆమె ఈ అవార్డును సొంతం చేసుకుంది. నిన్న ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును సుకృతి అందుకుంది.
ఇక సుకృతి గురించి చెప్పాలంటే తెలుగు డైరెక్టర్ సుకుమార్, తబితా సుకుమార్ లా పెద్ద కూతురు. ఆమె ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్ 8 చదువుతుంది. ఈ సినిమాతో ఆమె నటిగా పరిచయం అయ్యింది. ఈ చిత్రం గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి, సుకృతి నటనకు ప్రశంసల జల్లులతో పాటు ఈ చిత్రం పలు అవార్డులను గెలుచుకుంది.దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డిని అవార్డులు వరించాయి.
11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకోగా, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం. ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ ముఖ్య వుద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి బాలనటిగా ఉన్నప్పుడే ఈ అవార్డు ను అందుకున్న సుకృతి తండ్రి డైరెక్షన్ లో హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.