E-Paper
Advertisement

Maheshbabu-Trivikram movie : మ‌హేష్ డిసైడ్ అయ్యారు… షూటింగ్ సింగిల్ స్ట్రెచ్‌లోనే!

Maheshbabu-Trivikram movie : మ‌హేష్ డిసైడ్ అయ్యారు… షూటింగ్ సింగిల్ స్ట్రెచ్‌లోనే!
Advertisement

Maheshbabu-Trivikram movie : ఏ సినిమా షూటింగ్‌కి అయినా ప్రాణం హీరోల కాల్షీటే. ఆ హీరో కాల్షీట్ సాలిడ్‌గా దొరికితే నాన్‌స్టాప్‌గా ప‌నిచేయ‌డానికి రెడీ అంటుంది యూనిట్‌. ఇప్పుడు మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా యూనిట్ కోసం షూ లేస్ టైట్ చేసుకుని షూటింగ్‌కి సిద్ధం అంటోంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా ఓ సినిమా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయిన కొన్నాళ్ల‌కి మ‌హేష్ త‌ల్లి ఇందిరాదేవి క‌న్నుమూశారు. ఆ త‌ర్వాత రెండు నెల‌ల గ్యాప్‌లోనే తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ క‌న్నుమూశారు. త‌న ఇంట వ‌రుస విషాదాలు జ‌రుగుతుండ‌టంతో 2022లో ఇక సినిమా షూటింగులు చేయ‌న‌ని చెప్పేశారు మ‌హేష్‌.

రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. అక్క‌డి నుంచి యుఎస్‌కి వెళ్లారు.న్యూ ఇయ‌ర్‌లో మ‌రే డీవియేష‌న్ లేకుండా సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ పూర్తి అయ్యీ కాగానే, వెంట‌నే షూటింగ్ స్పాట్‌కి వ‌చ్చేస్తాను. ఫ్రెష్‌గా మొద‌లుపెట్టేద్దాం అని త్రివిక్ర‌మ్‌కి స‌మాచారం పంపేశార‌ట మ‌హేష్‌. అందుకే ఇప్పుడు త్రివిక్ర‌మ్ యూనిట్ అంతా షెడ్యూల్స్, కాల్షీట్స్, లొకేష‌న్స్ అంటూ అన్నిటినీ ఫైన‌లైజ్ చేసుకుంటోంది. ఈ మ‌ధ్య కొన్నాళ్లుగా రెస్ట్ తీసుకుంటున్న పూజా హెగ్డే కూడా ఫిట్ అయ్యారు. ఫ‌స్ట్ మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ పూర్తి చేశాక, మిగిలిన షూటింగుల‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు పూజా హెగ్డే. గ‌త కొన్నాళ్లుగా స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు పూజా హెగ్డే.

Advertisement

2023లో మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా త‌న‌కు పెద్ద బ్యాంగ్ అవుతుంద‌నే హోప్స్ తో ఉన్నారు. మ‌రోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్త‌య్యాయి. స్క్రిప్ట్ ని కూడా త్రివిక్ర‌మ్ ఇంకో సారి చూసుకున్నార‌ని టాక్‌. ఏక్‌ద‌మ్ 60 రోజుల షూటింగ్ అంటే, యూనిట్ అంతా ఆ మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే అంటున్నారు విశ్లేష‌కులు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×