BigTV English

Pharma Shares : కరోనా కేసులు పెరుగుతుండడంతో ఫార్మా షేర్లకు డిమాండ్..

Pharma Shares : కరోనా కేసులు పెరుగుతుండడంతో ఫార్మా షేర్లకు డిమాండ్..

Pharma Shares : చైనాతోపాటు జపాన్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్న వార్తలతో మళ్లీ ఫార్మా షేర్లకు డిమాండ్‌ వచ్చింది. కొన్నిరోజులుగా వరుస నష్టాల్లో ఉన్న ఈ షేర్లకు కరోనా వార్తలు టానిక్‌లా పనిచేస్తున్నాయి. దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్‌ ల్యాబ్‌ 4 శాతం, సిప్లా 3 శాతం, సన్‌ ఫార్మా, రెడ్డీస్‌ ల్యాబ్‌ 1 శాతంపైగా పెరిగాయి. అరబిందో ఫార్మా 4 శాతం, గ్లెన్‌మార్క్‌ ఫార్మా 7 శాతం, బయోకాన్‌ మూడున్నర శాతం, లారస్‌ ల్యాబ్‌ 3 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి.


ఇక ఇటీవల భారీగా పెరిగిన ఫర్టిలైజర్స్‌ షేర్లలో ఇవాళ తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. ఈ రంగానికి చెందిన అనేక షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నేషనల్ ఫర్లిలైజర్స్‌ 7 శాతం, దీపక్‌ ఫర్టిలైజర్స్‌ 5 శాతం, మంగళూర్‌ కెమికల్స్‌ 4 శాతం, మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ షేర్‌ 10 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అలాగే చక్కెర షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఉగర్‌ సుగర్‌ 8 శాతం, ద్వారికేష్‌ సుగర్‌ 3 శాతం, ఉత్తమ్‌ సుగర్స్‌ రెండున్నర శాతం, బజాజ్‌ హిందుస్థాన్‌ 2 శాతం చొప్పున నష్టపోయాయి.


Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×