E-Paper
Advertisement

Malli Pelli release date:- ‘మళ్ళీ పెళ్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Malli Pelli release date:- ‘మళ్ళీ పెళ్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్‌
Advertisement

Malli Pelli release date:- వార్త‌ల్లో వ్యక్తిగా నిలుస్తోన్న సీనియ‌ర్ న‌రేష్‌, త‌న స‌హ న‌టి ప‌విత్రా లోకేష్‌తో స‌హ జీవ‌నం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి చాలా గొడవే చేసింది. సోషల్ మీడియాకెక్కింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాను విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పేసింది. మరో మూడో భార్య నుంచి విడాకులు కోరుతూ నరేష్ కోర్టు మెట్లు ఎక్కిన సంద‌ర్భంలో ఆయన చేసిన మ‌రో ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆయ‌న త‌న సొంత క‌థ‌తోనే సినిమాను నిర్మించ‌టం మొద‌లు పెట్టారు. ఆయ‌న ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ.. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ టీజ‌ర్‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది.

Advertisement

మ‌ళ్ళీ పెళ్లి సినిమా ద్వారా నరేష్ ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నేది కాస్త అర్థ‌మైన‌ప్ప‌టికీ పూర్తి సారాంశం మాత్రం ఏంట‌నేది తెలియ‌టం లేదు. మ‌రి దీనిపై ఆయ‌న ఎలా స్పందిస్తారో చూడాలిక‌. అయితే తాజాగా మ‌ళ్ళీ పెళ్లి రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు సీనియ‌ర్ న‌రేష్‌. మే 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ఎం.ఎస్‌.రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమంటే.. మ‌ళ్ళీ పెళ్లి చిత్రంతో న‌రేష్ నిర్మాత‌గా మారారు. విజ‌య కృష్ణ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌ళ్ళీ పెళ్లి ట్రైల‌ర్‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ డేట్‌ను కూడా త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నారు. ఏదైతేనేం న‌రేష్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో జ‌రిగిన విష‌యాల పైనే మ‌ళ్ళీ పెళ్లి సినిమాను రూపొందించారా? లేక మ‌రేదైనా క‌థాంశ‌మా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. మ‌రి ఈ సినిమాపై న‌రేష్ మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి మ‌రి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×