Big Stories

Allari Naresh:- ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్: అల్ల‌రి న‌రేష్‌…

- Advertisement -

Allari Naresh:- అల్ల‌ర‌ల్ల‌రి చేసి న‌వ్వించి న‌రేష్ ఇప్పుడు సీరియ‌స్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఉగ్రం సినిమాలో అయిన ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌ను కూడా అందుకు యాడ్ చేసుకున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన ఉగ్రం సినిమా మే 5న రిలీజ్ అవుతుంది. ఇది ఆయ‌న 60వ చిత్రం. వ‌రుస ఫ్లాపుల‌తో బాధ‌ప‌డుతున్న న‌రేష్‌కు నాందితో హిట్ ఇవ్వ‌ట‌మే కాకుండా త‌న‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే ఉగ్రం సినిమా కూడా రూపొందింది. ఇందులో ఆయ‌న సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

ఉగ్రం సినిమా గురించి న‌రేష్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మై విష‌యాల‌ను తెలియ‌జేశారు. ‘ఇన్నేళ్ల ప్రయాణం అద్భుతంగా ఉంది. ఇందులో చాలా ఎత్తు ప‌ల్లాల‌ను చూశాను. ఈ క‌మ్రంలో గెలుపోట‌ముల‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాను. ఉగ్రం నా 60వ సినిమా. ఇన్ని సినిమాలు చేయ‌టం ఇప్ప‌ట్లో అంత‌ సులభం కాదు. ప్రేక్షకుల ఆదరణ వలనే ఇది సాధ్యపడింది. ఈ ప్రయాణంలో బాపుగారు, విశ్వనాథ్‌గారు, పెద్ద వంశీ , కృష్ణ వంశీ గారు లాంటి లెజెండరీ దర్శకులతో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను

కామెడీ సినిమాలు చేస్తూ వ‌చ్చిన నేను ఉన్న‌ట్లుడి ఉగ్రం వంటి సినిమాలు చేయ‌టం వెనుక సేఫ్ జోన్ ఉందా? అని చాలా మంది అడిగారు. సినీ ఇండ‌స్ట్రీలో ఏదీ సేఫ్ జోన్ కాదండీ. అయితే చిన్న డిఫ‌రెన్స్ ఉంది. సుడిగాడు, బెండుఅప్పారావు , కితకితలు ఇవన్నీ పెద్ద హిట్లు. ఇవి చూసినప్పుడు నరేష్ సినిమా బావుంది అంటారు కానీ నరేష్ కామెడీ బాగా చేశాడని ప్రేక్ష‌కులు అన‌రు. కానీ గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు చూసినపుడు నరేష్ బాగా యాక్ట్ చేశార‌ని చెబుతారు. కామెడీ చేసేవాళ్ళు అంటే ఎక్కడో చిన్న చూపు. అది తెలియకుండా వుంది. ఈ విషయంలో నాకు ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ వుంది. దాన్ని పోగొట్టుకునే క్ర‌మంలోనే ఉగ్రంలాంటి సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు నరేష్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News