E-Paper
Advertisement

Mallika Jagula: నేనేం ఒళ్లు అమ్ముకోలేదు.. అవకాశాలు లేక..

Mallika Jagula: నేనేం ఒళ్లు అమ్ముకోలేదు.. అవకాశాలు లేక..
Advertisement

Mallika Jagula: సినిమా ఒక రంగుల ప్రపంచం. హీరోయిన్లకు ఇదొక ముళ్ల జీవితం. మంచిగా ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. ఒకసారి దేనికైనా నో చెప్పారు అంటే.. వారి జీవితం మరోలా ఉంటుంది. ఇలా నో అని చెప్పినవారందరూ.. ఏ స్థాయిలో ఉన్నారో అందరికి తెల్సిందే. ఇండస్ట్రీ అంటేనే క్యాస్టింగ్ కౌచ్. ఈ లైంగిక వేధింపులను ఎదుర్కొని హీరోయిన్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పరోక్షంగానో, ప్రత్యేక్షంగానో.. కచ్చితంగా  క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొని ఉంటారు. కొంతమంది బయటపడతారు. ఇంకొంతమంది బయటపడరు. తాజాగా బుల్లితెర నటి మల్లిక.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది.

Advertisement

మల్లిక జాగుల.. చాలా సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసి మెప్పించింది. ఇక బుల్లితెరపై విలన్ గా కనిపిస్తూ మంచిపేరునే తెచ్చుకుంది. అయితే గత కొంతకాలంగా ఆమె సీరియల్స్ లో కూడా కనిపించడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లగక్కింది. ఈ మధ్య అందరూ బెంగుళూరు నుంచి నటీనటులను తెచ్చుకుంటున్నారని, తెలుగువారిని అస్సలు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఛాన్స్ లు లేక.. చేతిలో డబ్బులు లేక.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అని, కనీసం నిలబడలేని స్థితిలో ఉండేసరికి హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగిందని, చచ్చి బతికాను అని చెప్పుకొచ్చింది.

“కరోనా తరువాత ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అవకాశాలు లేక చీరలు అమ్మాను. మళ్లీ నా జీవితం మొదటికే వచ్చింది అనిపించింది. 19 ఏళ్ల అనుభవం.. అవకాశాలు లేవు. ఎంతో కుంగిపోయాను. వేరే ఏదైనా పనిచేద్దామని వెళ్తే అవమానించారు. చులకనగా చూసారు.  ఇండస్ట్రీలో ఉన్నవాళ్లను చూసి ఏదో డబ్బు ఉందని అనుకుంటారు కానీ, అదేం ఉండదు. ఇక నేను చాలా సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేశాను. మొదట నాకు మంచి పాత్రలే వచ్చాయి. అయితే నన్ను కమిట్ మెంట్ అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. నెలరోజులు టార్చర్ పెట్టారు. అందుకే సినిమాలువదిలేసి  సీరియల్స్ లో నా పాత్ర ద్వారా నేనెంటో చూపించాను. ఒళ్ళు అమ్ముకోలేదు.. ఒళ్ళు చూపించాను అంతే” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×