EPAPER

Manchu Manoj: అందరూ గుడ్ డాడీ అనుకుంటున్నారు.. ఆయన వెరీ బ్యాడ్ డాడీ

Manchu Manoj: అందరూ గుడ్ డాడీ అనుకుంటున్నారు.. ఆయన వెరీ బ్యాడ్ డాడీ

Manchu Manoj: మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆ కుటుంబంలో ఒకొక్కరు ఒక్కోరకం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంచు మోహన్ బాబు   ఉన్నది ఒకటి చెప్పేది మరొకటి.. మంచు విష్ణు.. ఉన్నదాని కన్నాఎక్కువ  చెప్పేరకం. ఇక మంచు లక్ష్మీ.. అమెరికా ఇంగ్లీష్ మొత్తం ఇండియాకు నేర్పించాలనుకొనే రకం. వీరందరిలో కొన్చమ్ అటు ఇటుగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఒకే ఒక్క వారసుడు  మంచు మనోజ్.


మొదటి నుంచి కూడా మనోజ్ వ్యక్తిత్వం అలాంటిదే. ఇది తప్పు అంటే దాన్ని తప్పు అనే చెప్తాడు. గొప్పలకు పోడు. తండ్రి, అన్నలా డబ్బా కొట్టుకోడు. అందుకే మంచు కుటుంబంలో  మనోజ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.  మనోజ్ హీరోగా తెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతుంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. పర్సనల్ గా అతను చాలా కష్టాలను ఎదుర్కున్నాడు.  మొదటి భార్యకు విడాకులిచ్చి.. మౌనిక రెడ్డిని ప్రేమించి.. ఇంట్లోవారిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది మాములు విషయం కాదు. ఆ సమయంలో అతడు పడిన  కష్టాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విధానం ప్రేక్షకుల హృదయాలను ద్రవింప జేసింది.

ఇక మౌనికను వివాహామాడి.. ప్రస్తుతం ఒక బిడ్డకు తండ్రి అయ్యి.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వడంతో కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా  కాకుండా విలన్ గా , సపోర్టివ్ రోల్స్ లో చేస్తూ కొట్తక్త్ పంథాలో తనను తాను నిరూపించడానికి రెడీ అవుతున్నాడు. మిరాయ్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మనోజ్ విలన్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఇది కాకుండా ఒక తమిళ్ రీమేక్ లో మనోజ్ నటిస్తున్నాడు.


ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా మనోజ్.. జీబ్రా టీజర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు. సత్య దేవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.  ఇక ఈ  టీజర్  లాంచ్ ఈవెంట్ లో భాగంగా మనోజ్ మాట్లాడుతూ.. ”  SN రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మంచివారికి మంచే జరగాలని కోరుకుంటాను. ఈ సినిమా కోసం అందరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా ఫేవరేట్.. నా తమ్ముడు సత్యదేవ్.. మంచి నటుడు. మొదటినుంచి తనకు నేను పెద్ద ఫ్యాన్.

సత్య రాజ్ గారి గురించి చెప్పాలంటే.. అందరు ఆయనను గుడ్ డాడీ .. గుడ్ డాడీ అంటున్నారు. కానీ, ఆయన చాలా  బ్యాడ్ డాడీ. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్  ఈశ్వర్.. తెలుగు నేర్చుకొని మరీ ఈ సినిమా తీశారు అంటే.. హ్యాట్సాఫ్ అని చెప్పాలి. అది చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం. అది ఈజీ అయిన విషయం కాదు. తెలుగు వచ్చినవాళ్లే డైలాగ్ చదువుకుండా  సెట్ కెళ్లే రోజులు ఇవి. కానీ, మీరు అంత కష్టపడి చేయడం నిజంగా గ్రేట్ ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు  నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Chiranjeevi: పండగ పూట.. సీఎం ఇంటికి చిరు.. ఎందుకు వెళ్లాడో తెలుసా.. ?

Mamitha Baiju: తెలుగులో ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు మొదటి సినిమా, ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్

Nutan Naidu: పండగ పూట.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం..

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పటికీ నా ఫేవరెట్ సినిమా.. హాలీవుడ్ నటి ప్రశంసలు

Dragon: డ్రాగన్ టైటిల్ కొట్టేసిన కుర్ర హీరో.. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ పరిస్థితి ఏంటి.. ?

Hari Hara Veera Mallu: బాణాలతో వీరమల్లు.. బాహుబలిని గుర్తుచేస్తున్నాడే

Jani Master: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు

Big Stories

×