E-Paper
Advertisement

Manchu Manoj: మిస్ అవుతున్నా నాన్న… ఉండలేకపోతున్నా… మంచు మనోజ్ ఎమోషనల్..!

Manchu Manoj: మిస్ అవుతున్నా నాన్న… ఉండలేకపోతున్నా… మంచు మనోజ్ ఎమోషనల్..!
Advertisement

Manchu Manoj:విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్న మంచు మోహన్ బాబు (Manchu Mohan babu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 4 నెలలుగా మంచు కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి.. ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో.. నాన్న నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటూ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మంచు మనోజ్.. చిన్నప్పుడు తన తండ్రి ఫోటోకి ముద్దాడుతున్న ఫోటోని జోడిస్తూనే.. మరొకవైపు తన తండ్రి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ ఇలా రాసుకోచ్చారు.. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకలో ఈ రోజున మేము మీ పక్కన ఉండడాన్ని కోల్పోతున్నాము.. మీ చుట్టూ ఉండి కూడా నేను ఈ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నాను. ప్రతి విషయంలో కూడా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న” అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ఆస్తుల వల్లే మంచు కుటుంబంలో విభేదాలు..

Advertisement

ఇదిలా ఉండగా గత నాలుగు నెలల క్రితం జల్పల్లిలో వున్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో తండ్రితోపాటు కలిసి నివసిస్తున్న మంచు మనోజ్ సడన్గా ఒక రోజు గాయాలతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, దానిని వ్యతిరేకించబోతే తన తండ్రి తరఫు రౌడీలు తనపై దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదే రోజు రాత్రి సమయంలో మంచు మోహన్ బాబు కూడా తన కొడుకు మంచు మనోజ్ కోడలు భూమా మౌనిక వల్ల ప్రాణహాని ఉంది అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా పరస్పరం కంప్లైంట్ ఇవ్వడంతో ఆస్తి కోసమే గొడవలు జరిగాయని అందరూ అనుకున్నారు.

జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి..

Advertisement

అయితే అలా గొడవలు జరుగుతున్న సమయంలో ఒకరోజు మంచు మనోజ్ డిఎస్పి, డీజీలను కలిసి మోహన్ బాబు ఇంటికి వస్తుండగా ..ఆయన ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ వీరిని లోపలికి అనుమతించలేదు. దాంతో గేట్లు బద్దలు కొట్టుకొని మరీ మనోజ్ లోపలికి వెళ్లిపోవడంతో..ఆ సమయంలో అక్కడికి వచ్చిన మీడియా మిత్రులు మోహన్ బాబును ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆయన జర్నలిస్టులపై దాడి చేయగా వారు ఈయనపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఈ విషయంలో కోర్టు మెట్లు కూడా ఎక్కారు మోహన్ బాబు. ఇక తర్వాత సంక్రాంతి సందర్భంగా తిరుపతి లో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×