BigTV English

Bheems: రెండు సినిమాలు, ఇద్దరు స్టార్ హీరోలు, ఒకటే సీజన్… న్యాయం చేయగలడా?

Bheems: రెండు సినిమాలు, ఇద్దరు స్టార్ హీరోలు, ఒకటే సీజన్… న్యాయం చేయగలడా?

సినీ ఇండస్ట్రీలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ వరుసగా రెండు పెద్ద సినిమాలకు సంగీతం అందించడం పెద్ద సవాల్. భీమ్స్ సెసిరోలియో ఇప్పుడు అటువంటి రేర్ ఛాన్స్ దక్కించుకున్నాడు. 2026 సంక్రాంతి బరిలో నిలిచే రవితేజ – కిషోర్ తిరుమల మూవీకి కూడా భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు అధికారికంగా ఫిక్స్ అయ్యింది. చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాకూ భీమ్స్ మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే.


ధమాకా నుండి స్టార్స్ వరకూ.. భీమ్స్ రైజ్!

భీమ్స్ సెసిరోలియో పేరు తెలుగులో పెద్దగా ప్రచారంలోకి వచ్చిందే రవితేజ ‘ధమాకా’ సినిమాతో. ఆ సినిమాకు ఇచ్చిన మాస్ బీట్ ఆల్బమ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా “జింతాక”, “మాస్ రాజా” సాంగ్స్ యూత్‌లో ట్రెండింగ్ అయ్యాయి. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో, భీమ్స్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.


ఇక 2025 సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి – వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా కూడా భీమ్స్ కి మరో హిట్ ఆల్బమ్ ఇచ్చింది. గోదారిగట్టు మీద సాంగ్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాలిడ్ గా ప్రమోట్ అయ్యింది. దాంతో ఇప్పుడు 2026 సంక్రాంతికి వస్తున్న రెండు సినిమాలకు అతనే మ్యూజిక్ అందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రెండు పెద్ద సినిమాలకు మ్యూజిక్ ఎలా హ్యాండిల్ చేస్తాడు?

ఒకే టైమ్‌లో రెండు పెద్ద హీరోల సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ ఇవ్వడం పెద్ద టాస్క్. ఒకవైపు రవి తేజ మాస్ కమర్షియల్ మూవీ, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మూవీ కావడంతో, రెండింటికీ విభిన్నమైన సంగీతాన్ని అందించాల్సి ఉంటుంది. రవితేజ సినిమా కోసం పక్కా మాస్ బీట్స్, చిరు సినిమా కోసం వైవిధ్యమైన మెలోడీస్, కమర్షియల్ ట్యూన్స్ ఇచ్చేలా భీమ్స్ పని చేయాల్సి ఉంటుంది.

సంక్రాంతి మార్కెట్ & భీమ్స్ స్ట్రాటజీ

సంక్రాంతి తెలుగు సినిమాల బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఈ సీజన్‌లో వచ్చిన సినిమాలకు మ్యూజిక్ పెద్ద ప్లస్ అవుతుంది. ధమాకా విజయాన్ని తలచుకుంటే, భీమ్స్ ఇప్పటికే సంక్రాంతి మాస్టర్ అని చెప్పొచ్చు. కానీ, ఒకేసారి రెండు పెద్ద సినిమాలకు మ్యూజిక్ చేయడం అనేది పెద్ద పరీక్ష. రెండు సినిమాల మ్యూజిక్ ఆల్బమ్ లలో ఒకదానితో ఒకటి పోలిన ఫీల్ రాకుండా డిఫరెంట్ సౌండ్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉంది.

భీమ్స్ కెరీర్‌కు బిగ్గెస్ట్ అపర్చునిటీ!

ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే బిగ్ స్టార్స్ సినిమాలు చేయడం తప్పనిసరి. భీమ్స్ ఇప్పటికే రవితేజతో హిట్ ఇచ్చాడు, వెంకీ  మామకి హిట్ ఇచ్చాడు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి, ఆయన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం భీమ్స్ కి బిగ్గెస్ట్ టాస్క్ అండ్ టెస్ట్ కూడా. మరి 2026 సంక్రాంతి ఈయన కెరీర్‌ను కొత్త హైట్స్‌కి తీసుకెళ్తుందా? లేదా ఈ రెండు సినిమాల మ్యూజిక్ పరంగా ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి!

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×