E-Paper
Advertisement

Manchu Manoj : ఉస్తాద్ తో ర్యాంప్ ఆడించడానికి రెడీ అవుతున్న మంచు బాబు..

Manchu Manoj : ఉస్తాద్ తో ర్యాంప్ ఆడించడానికి రెడీ అవుతున్న మంచు బాబు..
Advertisement
Manchu Manoj

Manchu Manoj : మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కాస్త ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న నటుడు మంచు మనోజ్. మంచి కామెడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన మనోజ్ కొన్ని పర్సనల్ కారణాలవల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. మొదటి భార్యతో విడాకులు.. మనస్థాపం.. దీంతో ఒంటరిగా మిగిలిన మనోజ్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యాక.. తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు.

కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మనోజ్.. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెర పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈటీవీ విన్ లో మనోజ్ ఒక షో చేస్తాడు అని అప్పట్లో ప్రోమో కూడా విడుదల చేశారు.. కానీ ఆ తర్వాత దాని గురించి ఊసే లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారధ్యంలో రూపొందే ఈ షో కి ర్యాంప్ ఆడిద్దాం అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.

Advertisement

తాజాగా ఇప్పుడు ఈ షో కి సంబంధించిన టైటిల్ను రివీల్ చేస్తూ మనోజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాష్ టాగ్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం.. నా తొలి గేమ్ షో అంటూ మనోజ్ టైటిల్ ని రివిల్ చేశాడు. దీంతో పాటుగా బుల్లితెరపై సందడి చేయబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. తన ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో స్మాల్ స్క్రీన్ ని కూడా వైడ్ గా మారుస్తానని అంటున్నాడు. సంవత్సరాలుగా తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞుడనని.. ప్రస్తుతం తనకు లైఫ్లో మంచి వైబ్స్ కనిపిస్తున్నాయని.. ఆరోగ్యకరమైన ..ఆహ్లాదకరమైన రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ మనోజ్ తన పోస్టులో రాశాడు.

ఈ షో కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ షూట్లో హనుమాన్ టీం పాల్గొన్నారట.ప్రశాంత్ డైరెక్షన్ లో  తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ కాంబోలో వస్తున్న హనుమాన్ మూవీ సంక్రాంతి బరిలో దిగడానికి రెడీగా ఉంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం మంచు వారి షో కి హాజరయ్యారు. ఈ షో ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ పోస్టర్లో మనోజ్ వెరైటీ గెటప్ లో.. మాస్క్ చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఈ షో కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×