BigTV English

Manchu Vishnu’s Kannappa Update: గుర్రమెక్కిన మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

Manchu Vishnu’s Kannappa Update: గుర్రమెక్కిన మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

Manchu Vishnu’s Kannappa Teaser Releasing on June 14th: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ మూవీపై యావత్ సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. అందువల్లనే ఇప్పుడు అందరి ఫోకస్ ఈ మూవీపై కూడా పడింది. నేషనల్ వైడ్‌గా ఈ చిత్రానికి బజ్ ఏర్పడుతోంది. ఈ మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై టాలీవుడ్ కలెక్షన్ల కింగ్ మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.


ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఇందులో స్టార్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానంద్, కాజల్ వంటి నటీ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లో రెండు భారీ షెడ్యూళ్లను మూవీ మేకర్స్ కంప్లీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇంత వరకు గ్లింప్స్, కానీ ఫస్ట్ లుక్ వీడియోస్ కానీ మేకర్స్ వెల్లడించలేదు. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప మూవీ టీం సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ కన్నప్ప టీజర్‌ను ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు నటుడు మంచు విష్ణు తెలిపాడు. అంతేకాకుండా అక్కడి వారంతా తమ సినిమా టీజర్‌ను బాగా మెచ్చుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.


Also Read: ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ డేట్ వెల్లడించిన మంచు విష్ణు.. అంతకంటే ముందు..

అయితే మరి ఆ టీజర్‌ను ఇక్కడ ఏ రోజు విడుదల చేస్తున్నారో కూడా తెలిపాడు మంచు విష్ణు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. కన్నప్పను అందరికీ పరిచయం చేయడానికి మూవీ టీం సిద్ధమైంది. ఈ నెల అంటే జూన్ 14న కన్నప్ప మూవీ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ మరోసారి ప్రకటించారు. ఈ విషయాన్ని మరోసారి తెలియజేస్తూ మంచు విష్ణు తన ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్టర్ షేర్ చేశాడు. అయితే అందులో ఫ్రంట్ సైడ్‌ నుంచి కాకుండా.. బ్యాక్ సైడ్ నుంచి ఉన్న పోస్టర్‌ను రివీల్ చేశాడు. ఆ పోస్టర్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. గుర్రం మీద కూర్చుని ఉన్న విష్ణు లుక్ చాలా అద్భుతంగా ఉంది. మరి టీజర్ ఎలా ఉంటుందో త్వరలో తేలిపోనుంది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×