Vishnu Manchu – Kannappa Teaser: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాపై యావత్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మంచు విష్ణు చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతేకాకుండా సినీ ప్రేక్షకులు కూడా విష్ణు సినిమాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈ సారి మాత్రం విష్ణు తనేంటో.. తన లెక్కేంటో.. ఆ లెక్కకున్న తిక్కేంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇందులో భాగంగానే తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘కన్నప్ప’ మూవీ చేస్తున్నాడు. అయితే ఇందులో భారీ స్టార్ క్యాస్టింగ్‌ను కూడా దింపుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ వంటి బడా స్టార్ హీరోలను ఇందులో భాగం చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అందువల్లనే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా ఈ మూవీ మొత్తం షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుపుకుంటుంది. అక్కడి అందమైన లొకేషన్లలో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా నేచురల్ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వబోతుంది. అలాగే ఇందులోని ప్రభాస్ తన పాత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అది ఇండియాలో కాదు. ఫ్రాన్స్‌లో ప్రదర్శించారు.
Also Read: కేన్స్ లో కన్నప్ప టీజర్.. ఫ్రాన్స్ కు బయల్దేరిన మోహన్ బాబు
ఇటీవల 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఫ్రాన్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో మే 20వ తేదీన మేకర్స్ కన్నప్ప మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ టీజర్‌ను చూసిన అక్కడి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారట. టీజర్ ఎక్స్‌లెంట్‌గా ఉందని.. సినిమా మంచి హిట్ అవుతుందని విష్ణుకి చెప్పారట. దీంతో వారి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి విష్ణు గాల్లో తేలిపోయాడట. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు.
మరి కన్నప్ప టీజర్‌ను ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అంతా అనుకుంటుండగా.. అందుకు సంబంధించిన డేట్ కూడా వెల్లడించాడు. ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప టీజర్‌ను జూన్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు. అయితే అంతకంటే ముందుకు అంటే మే 30న ఓ థియేటర్లలో సెలెక్టెడ్ మెంబర్స్‌కు ఈ టీజర్‌ను చూపించబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడి ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.