Dewald Brevis : ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ-20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా తాజాగా రెండో టీ-20 జరుగుతుంది. ఇందులో సౌతాఫ్రికా జట్టు యంగ్ ప్లేయర్ డెవాల్ట్ బ్రెవిస్ ఊచకోత కోశారు. బ్రెవిస్ 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 56 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని సునామీ ధాటికి సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 218/7 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మాక్రామ్ 18, రికెల్టన్ 14, ప్రిటోరియస్ 10, స్టబ్స్ 31, డస్సెన్ 5 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హెజెల్ వుడ్ 1, మ్యాక్స్ వెల్ 2, ద్వార్షిస్ 2, జంపా 1 వికెట్లు తీశారు.
Also Read : Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా
బ్రెవిస్ బ్యాటింగ్ అదుర్స్
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు బ్రెవీస్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో ఇరుగ దీసింది. మరోవైపు తొలి టీ-20లోనే సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ తమ దేశానికి చెందిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ ను అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రైలియా పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డొనాల్డ్ ని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో షేర్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్ సౌతాఫ్రికా పై 69 మ్యాచ్ ల్లో 190 వికెట్లు తీశాడు. వార్న్ తరువాత టాప్ 5 స్థానాల్లో డెల్ స్టేయిన్ 127 వికెట్లు, మెక్ గ్రాత్ 115 వికెట్లు, రబాడ 99 వికెట్లు, డొనాల్డ్ 98 వికెట్లు ఉన్నారు. రబాడ ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ-20లో సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో అతను 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
రబాడ రికార్డు..
ఇక రబాడతో పాటు క్వేనా మపాకా కూడా రాణించడంతో ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌట్ అయింది. మరోవైపు టిమ్ డేవిడ్ తొలి ఇన్నింగ్స్ లో 52 బంతుల్లో 83 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో బ్రెవిస్ 56 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 22 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 5, కామెరాన్ గ్రీన్ 9, టిమ్ డేవిడ్ 50, మ్యాక్స్ వెల్ 10 బ్యాటింగ్ చేస్తున్నాడు. మిచెల్ ఓవన్ 1 పరుగు చేసి క్రీజులో ఉన్నారు. రబాడ 1, మార్క్రమ్ 1, మెపాక అ, బోస్క్ 1 వికెట్లు తీశారు. మొత్తం సౌతాఫ్రికా బౌలర్లు ఇప్పటి వరకు 4 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. రెండో టీ-20 మ్యాచ్ మాత్రం నువ్వా..? నేనా అన్నట్టు మ్యాక్స్ వెల్ క్రీజులో ఉంటే మాత్రం ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. లేదంటే సౌతాఫ్రికా గెలిచే ఛాన్స్ అధికంగా కనిపిస్తున్నాయి. బ్రెవిస్ దెబ్బకి ఆస్ట్రేలియా కి ఓటమి తప్పడం లేదని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్న బ్రెవిస్ అద్భుతంగా ఆడుతుండటంతో 2026 సీజన్ లో చెన్నై కి బ్యాటింగ్ లో కొదవలేదు అనే చెప్పవచ్చు. చివరి రెండు మ్యాచ్ ల్లో బ్రెవిస్ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.