E-Paper
Advertisement

Mangli : నా కారుపై దాడి జరగలేదు.. బళ్లారి ఘటనపై మంగ్లీ క్లారిటీ..

Mangli : నా కారుపై దాడి జరగలేదు.. బళ్లారి ఘటనపై మంగ్లీ క్లారిటీ..
Advertisement

Mangli : సింగర్​ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందని ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ ను ఆమె ఖండించింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.

ఈ ఘటనపై మంగ్లీ ఓ నోట్ విడుదల చేసింది. తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేసిన తప్పుడు వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని మంగ్లీ ఆ నోట్ లో పేర్కొంది. ఫోటోలు, వీడియోలు చూస్తే ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలుస్తోందని, తన ఉత్తమ ఈవెంట్‌లలో ఇది ఒకటి తెలిపింది. కన్నడ ప్రజలు తనపై చూపించిన ప్రేమ అపారమైనది వివరించింది. ఈ కార్యక్రమ నిర్వహకులు తనను చాలా బాగా చూసుకున్నారని పేర్కొంది. ఈ విషయం మాటలలో వర్ణించలేనిదని తెలిపింది. తన ప్రతిష్టను తగ్గించేందుకు కారుపై దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తప్పుడు ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని స్పష్టం చేసింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నోట్ లో మంగ్లీ పేర్కొంది.

Advertisement

కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. కన్నడలో మాట్లాడాలని మంగ్లీని యాంకర్ కోరారు. కానీ మంగ్లీ తన ప్రసంగాన్ని తెలుగులోనే కొనసాగించింది. తర్వాత యాంకర్ బలవంతం చేయడంతో కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది మంగ్లీ. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… కన్నడిగులు మంగ్లీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంగ్లీ కారుపై దాడి జరిగిందని వార్తలు రావడం కలకలం రేపింది. అయితే తనపై దాడి జరగలేదని మంగ్లీనే స్వయంగా చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×