E-Paper
Advertisement

Manobala : కోలీవుడ్ లో విషాదం.. స్టార్ కమెడియన్ మనోబాల కన్నుమూత..

Manobala : కోలీవుడ్ లో విషాదం.. స్టార్ కమెడియన్ మనోబాల కన్నుమూత..
Advertisement

Manobala : కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. స్టార్ కమెడియన్ మనోబాల కన్నుమూశారు. తమిళ ఇండస్ట్రీలో గొప్ప కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే 69 ఏళ్ల మనోబాల లివర్ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

Advertisement

1970ల్లో సినీ పరిశ్రమలోకి మనోబాల అడుగుపెట్టారు. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా తనదైన ముద్రవేశారు. దర్శకుడిగా 20కిపైగా సినిమాలను తెరకెక్కించారు. 3 సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు.

మనోబాల కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యేవారు. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో ఆయన కచ్చితంగా ఉండేవారు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించారు. పలు సీరియళ్లలోనూ నటించారు. అలా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. మనోబాల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు.

Advertisement

తెలుగు చిత్రాల్లోనూ మనోబాల నటించారు. మహానటి, దేవదాసు, రాజ్‌దూత్‌ లాంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీలో మనోబాల నటించారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×