BigTV English

Rohith Vs Dhawan:- రోహిత్ వర్సెస్ ధావన్… గెలిచేదెవరు?

Rohith Vs Dhawan:- రోహిత్ వర్సెస్ ధావన్… గెలిచేదెవరు?

Rohith Vs Dhawan:- మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే 46వ మ్యాచ్‌లో.. రోహిత్ సేననే ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది. ఆడిన 8 మ్యాచులలో 4 మ్యాచులు గెలిచి 10 పాయింట్లతో ఐదు టీమ్స్ కంటే వెనక ఉంది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై ముంబై గెలిస్తే.. ప్లేఆఫ్ స్పాట్‌కి రోహిత్ సేన చాలా దగ్గరికి వచ్చినట్టే. కాకపోతే.. నెట్ రన్ రేటును కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో పంజాబ్, ముంబై జట్లు తలపడితే.. పంజాబ్ కింగ్సే హైయెస్ట్ స్కోరింగ్‌తో గెలిచింది. గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ రాణించినప్పటికీ.. అర్హదీప్ సింగ్ తన బౌలింగ్‌తో కుప్పకూల్చాడు. కాకపోతే.. ఈ మ్యాచ్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది ముంబై. లాస్ట్ మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి మంచి ఊపుమీద ఉంది రోహిత్ సేన.


ఇవాళ్టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కొన్ని మార్పులతో బరిలో దిగబోతోంది. పవర్ ప్లే బౌలింగ్ అంత ఎఫెక్టివ్‌గా లేకపోవడంతో.. బెహ్రెన్‌డార్ఫ్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. ఇక క్రిస్ జోర్డాన్‌ను రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఆడించేందుకు సిద్ధమవుతోంది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మార్పులు చేశాడు రోహిత్ శర్మ. బెహ్రెన్‌డార్ఫ్‌ స్థానంలో మెరెడిత్‌ను తీసుకొచ్చాడు. కాకపోతే… మెరిడిత్ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మళ్లీ బెహ్రెన్‌డార్ఫ్‌నే తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా నెహాల్ వాధెరాను తీసుకునే ఛాన్స్ ఉంది. బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కుమార్ కార్తికేయ లేదా హృతిక్ షోకీన్‌లలో ఒకరిని ఎంచుకోవచ్చు.

ఇక పంజాబ్ జట్టు కూడా బలంగానే ఉంది. 9 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు అర్హదీప్ సింగ్. పంజాబ్ తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ శిఖర్ ధావనే. కాకపోతే.. బౌలింగ్, బ్యాటింగ్‌లో పంజాబ్ కంటే ముంబైకే మెరుగైన ప్లేయర్లు ఉన్నారు. పీయూష్ చావ్లా 8 మ్యాచులలో 13 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్‌ 6 మ్యాచులలో 8 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ ముంబై తరపున తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్ హైయెస్ట్ స్కోరర్స్‌గా ఉన్నారు. సో, ఎలా చూసినా.. ఇవాళ్టి ఫేవరేట్ జట్టు ముంబై ఇండియన్సే.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×