BigTV English

China : కొత్త వైరస్ లేదు.. డబ్ల్యూహెచ్ఓకు చైనా నివేదిక

China :  కొత్త వైరస్ లేదు.. డబ్ల్యూహెచ్ఓకు చైనా నివేదిక
China

China : కరోనా పుట్టుకకు కారణమైన చైనాలో.. ఇప్పుడు మరో వైరస్ విజృంభిస్తుండటం కలవరపెడుతోంది. కరోనా మహమ్మారికి కారణం తాము కాదని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేసిన చైనా.. మళ్లీ అదే పాటపాడుతోంది. చైనాలోని చిన్నారులలో ఉన్నట్టుండి బయటపడిన న్యూమోనియా కేసులతో ప్రపంచం ఉలిక్కిపడింది. వందలాది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతుండటంతో.. ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ సైతం చైనాను వివరణ కోరింది. తాజాగా తమకు అందిన నివేదిక ప్రకారం చైనాలో శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోస సమస్యలే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.


ఈ మేరకు బీజింగ్ వివరణ ఇచ్చిందని, బాధితులలో న్యూమోనియా మినహా కొత్తవైరస్ ఏదీ లేదని చెప్పినట్లు చైనా సీజీటీఎన్ కథనంలో పేర్కొంది. శరవేగంగా వ్యాపించిన శ్వాసకోస సమస్యపై 24 గంటల్లోనే డబ్ల్లూహెచ్ఓకు కచ్చితమైన సమాచారం అందిందని సీజీటీఎన్ వెల్లడించింది. బీజింగ్, లియోనోంగ్ లో నిర్వహించిన పరీక్షల్లో కొత్తవైరస్ ను గుర్తించలేదని పేర్కొంది.

దీనిపై ఆసుపత్రి శ్వాసకోశ విభాగం డైరెక్టర్ ఝావో షన్నియింగ్ మాట్లాడుతూ.. సీడీసీ నుంచి పొందిన డేటా మేరకు రోగుల నుంచి సేకరించిన మైక్రోప్లాస్మాలో ఎలాంటి మార్పు లేదన్నారు. చైనాలో మైక్రోప్లాస్మా న్యూమోనియా చాలా ఏళ్లుగా ఉందని, దీనికి కచ్చితమైన రోగ నిర్థారణ లేదు కానీ.. ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు.


Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×