E-Paper
Advertisement

Actor Satish Joshi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటిస్తూ తుదిశ్వాస విడిచిన నటుడు..!

Actor Satish Joshi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటిస్తూ తుదిశ్వాస విడిచిన నటుడు..!
Advertisement

Marathi TV Actor Satish Joshi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ మరాఠీ నటుడు సతీష్ జోషి తుది శ్వాస విడిచారు. మరాఠీలో పలు సినిమాలు, సీరియల్స్‌లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా స్టేజీపై నటిస్తూ కన్నుమూశారు. ఈ వార్త మరాఠీ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని సతీష్ జోషి స్నేహితుడు రాజేష్ దేశ్ పాండే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

‘రంగోత్సవ్ వేదికపై నటిస్తూ సతీష్ జోషి తుది శ్వాస విడిచాడు. ఈ హఠాన్మరణంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మా సీనియర్ స్నేహితుడు నటుడు సతీష్ జోషి తన విషాద మరణానికి ముందు రంగోత్సవ్‌లో వేదికపై నటించారు. అతను ఉదయం 11 గంటలకు మరణించాడు. తుది శ్వాస విడిచే ముందు కూడా, అతను తన ప్రదర్శన గురించి ఉత్సాహంగా ఉన్నాడు’ అని రాసుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో సతీష్ జోషికి అభిమానులు నివాళులు అర్పించారు.

Advertisement

అలాగే సతీష్ జోషికి నివాళులు అర్పిస్తూ మరొక నటుడు అతుల్ కాలే తన సోషల్ మీడియాలో పోస్ట్‌ను పంచుకున్నారు. సతీష్ జోషి ఫోటోను పంచుకుంటూ.. ‘జోషి గురూజీ ఈరోజు మరణించారు. అతను, నా కుటుంబం చాలా సపోర్ట్ చేశారు. అతని ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ తెలిపాడు. ఇకపోతే సతీష్ జోషి కెరీర్ విషయానికొస్తే.. ఆయన అనేక సినిమాలు, సీరియల్స్, నాటకాలలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా జీ మరాఠీ సీరియల్ ‘భాగ్యలక్ష్మి’ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్స్‌లో అతడి పాత్రకు ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్ రౌండర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నాడు.

Also Read: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ నటుడు మృతి

Advertisement

వీరేంద్ర ప్రధాన్ దర్శకత్వం వహించిన చాలా సీరియల్స్‌లో సతీష్ జోషి నటించారు. సాహిత్య సంఘం వారి ‘మచ్చకటిక’ నాటకానికి కూడా పనిచేశారు. ఆయన మరణవార్త విన్న కళాకారులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతకు ముందు కూడా చాలా మంది కళాకారులు వేదికపైనే తుది శ్వాస విడిచారు. ది క్రియేషన్ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా రామభూమిలో సతీష్ జోషి కాన్వకేషన్ వేడుక కూడా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో సతీష్‌ జోషి పాల్గొన్నారు. సృజనోత్సవం జరుగుతుండగా మృతి చెందాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×