BigTV English

Game of Thrones – Ian Gelder Dies: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ నటుడు మృతి

Game of Thrones – Ian Gelder Dies: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ నటుడు మృతి

Game of Thrones – Ian Gelder Dies: సినీ ఇండస్ట్రీలో రోజుకో విషాదం జరుగుతుంది. రీసెంట్‌గా మలయాళ దర్శకుడు మృతి చెందాడు. అలాగే టైటానిక్ నటుడు సైతం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక ప్రముఖ యాక్టర్ తుది శ్వాస విడిచాడు. హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో కెవాన్ లన్నిస్టర్ పాత్ర పోషించిన ప్రముఖ యాక్టర్ ఇయాన్ గెల్డర్ (74) ఏళ్ల వయసులో కన్నుమూశారు.


ఆయన మరణ వార్తను ఇయాన్ భార్య బెన్ డేనియల్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో డేనియల్స్ తన ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నారు.. ‘నా ప్రియమైన భర్త, జీవిత భాగస్వామి ఇయాన్ గెల్డర్ మరణిస్తున్నట్లు ప్రకటించడానికి నేను ఈ పోస్ట్‌ను వదిలివేస్తున్నాను’ అని అందులో రాసుకొచ్చారు.

అంతేకాకుండా ఇయాన్ గెల్డర్ గత కొంత కాలంగా ‘పిత్త వాహిక క్యాన్సర్‌’ (battling bile duct cancer)తో పోరాడుతున్నాడని డేనియల్స్ వెల్లడించారు. ఈ మేరకు డేనియల్స్ వారి మూడు దశాబ్దాల భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ఆయన మృతిపై పలువురు సెలబ్రిటీలు, తోటి నటీనటులు, పరిశ్రమ సహచరులు సంతాపం తెలియజేస్తూ గెల్డర్‌కు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు.


Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

కాగా ఇయాన్ గెల్డర్‌ పలు సినిమాలతో ఎంతో మంది సినీ ప్రియుల్ని అలరించాడు. అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. క్వీర్స్, సర్జ్, షేక్స్‌పియర్ గ్లోబ్, అండర్‌డాగ్, హజ్ డార్క్ మెటీరియల్స్ వంటి సినిమాల్లో నటించిన ఇయాన్ మంచి గుర్తింపును పొందాడు. అయితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే అద్భుతమైన పేరును పొందాడు. ఈ పాత్రతోనే అతడు బాగా ఫేమస్ అయ్యాడు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×