E-Paper
Advertisement

Update on Devara: ‘దేవర’ నుంచి కిరాక్ అప్డేట్.. ఎన్టీఆర్‌కు జోడీగా మరాఠీ ముద్దుగుమ్మ..?

Update on Devara: ‘దేవర’ నుంచి కిరాక్ అప్డేట్.. ఎన్టీఆర్‌కు జోడీగా మరాఠీ ముద్దుగుమ్మ..?
Advertisement
devara movie update

Update on Devara Movie(Telugu film news): యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశాయి. ముఖ్యంగా టీజర్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్ అభిమానుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ అబ్బో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మైండ్ బ్లోయింగ్.

Advertisement

పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

READ MORE: Devara: భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్ని కోట్లంటే..!

Advertisement

కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉండటంతో మూవీ వాయిదా పడే అవకాశాలు చాలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ కూడా ఇంతవరకు నోరు మెదపక పోవడంతో ఈ మూవీ వాయిదా వార్తలు నిజమేనని అంతా అనుకుంటున్నారు.

ఇదంతా ఒకెత్తయితే తాజాగా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ‘దేవర’ మూవీ ఓవర్సీస్ డీల్ దాదాపు రూ.27 కోట్ల ధరకు అమ్ముడు అయ్యాయి. అయితే ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో హైయ్యెస్ట్ డీల్ ఇదేనని అంటున్నారు.

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీలో షూటింగ్‌లో యాక్టర్‌ సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. మళ్లీ రీసెంట్‌గా షూటింగ్ మొదలయినట్లు సమాచారం.

READ MORE: Devara: దేవర వాయిదా అధికారికమేనా?

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ హీరోయిన్ కాకుండా.. ఇందులో మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరాఠీ హీరోయిన్ శ్రుతి మరాటే మరో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ద్వారా శ్రుతి మరాటే టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఈ విషయంపై మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×