E-Paper
Advertisement

Barbie Telugu OTT: ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీ తెలుగులోకి వచ్చేసింది!

Barbie Telugu OTT: ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీ తెలుగులోకి వచ్చేసింది!
Advertisement

Barbie Telugu OTT Release Date: కరోనా కష్టకాలంలో ఓటీటీలకు ఆదరణ బాగా లభించింది. థియేటర్లకు వెళ్లే వీలు లేక అప్పట్లో ఓటీటీలపై పడ్డారు. దీంతో ఓటీటీలకు సూపర్ డూపర్ క్రేజ్ ఏర్పడింది. దీంతో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రముఖ సంస్థలు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా ఆడియన్స్‌కు తగ్గ స్టోరీలను ఎంచుకుంటూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి.

అయితే తాజాగా ఓ ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హాలీవుడ్‌ మూవీ తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదే ‘బార్బీ’ మూవీ. ఈ హాలీవుడ్ బార్బీ మూవీ రీసెంట్‌గా జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల్లో ఎనిమిది నామినేషన్స్‌ను దక్కించుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ సహాయనటుడు, బెస్ట్ సహాయనటి, కాస్ట్యూమ్ డిజైన్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లేతో పాటు మరికొన్ని విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

అయితే చివరికి ఈ మూవీకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డు లభించింది. ఈ మూవీలో మార్గరేట్ రాబీ, రేయాన్ గ్లోసింగ్ ప్రధాన పాత్రలు చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వీరి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా హాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది.

Also Read: ఆస్కార్ 2024 గెలిచిన సినిమాలు చూసారా..? లేదా అయితే ఈ ఒటీటీల్లో చూడండి!

Advertisement

128 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1.446 బిలియన్ డాలర్లు వసూళు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. కలెక్షన్ల పరంగా హాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఇండియాలోనూ రిలీజ్ అయిన ఈ చిత్రం దాదాపు రూ.150 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా బార్బీ రికార్డు క్రియేట్ చేసింది.

ఇక థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఇంగ్లీష్‌ వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో తెలుగులో ఈ రోజు నుంచి (శనివారం) స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ మూవీని చూడొచ్చు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×