Big Stories

Bomb Blast in Balochistan: బలూచిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. జర్నలిస్ట్ సహా ముగ్గురు మృతి..!

Bomb Blast in Balochistan: పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో .. ఒక కారు లక్ష్యంగా చేసిన బాంబ్ బ్లాస్ట్ లో జర్నలిస్ట్ సహా ముగ్గురు మరణించారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఖుజ్దార్ పట్టణం శివార్లలోని చోమ్రోక్ చౌక్ సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ రోడ్డు పక్కన బాంబును అమర్చారు. సీనియర్ జర్నలిస్ట్, ఖుజ్దార్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన మౌలానా సిద్దిక్ మెంగల్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు.. ముష్కరులు బాంబును పేల్చారు.

- Advertisement -

మౌలానా మెంగల్, మరో ఇద్దరు బాటసారులు పేలుడులో మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడగా.. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మెంగల్ జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI-F) పార్టీకి ప్రావిన్షియల్ ఆఫీస్ బేరర్‌గా కూడా ఉన్నారు. అతను స్థానిక వార్తాపత్రిక “వాతన్” కోసం కూడా వ్రాసేవాడు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టుపై దాడి జరిగింది.

- Advertisement -

Also Read: లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి

మెంగల్ జర్నలిస్ట్ అయినందుకే దాడి చేశారా లేక.. JUI-F యొక్క ప్రాంతీయ ఆఫీస్ బేరర్‌గా పనిచేసినందుకు ఈ దాడి జరిగిందా అన్నది తెలియాల్సి ఉందని ఒక పోలీస్ అధికారి తెలిపారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి.. అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. బలూచిస్తాన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (BUJ) మెంగాల్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించింది మరియు ప్రావిన్షియల్ ప్రభుత్వం హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News