E-Paper
Advertisement

Mr.Bachchan Trailer: సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే

Mr.Bachchan Trailer: సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే
Advertisement

Mr.Bachchan Trailer: మాస్ మహారాజ రవితేజ- హరీష్ శంకర్ కాంబోలో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇందులో మిస్టర్ బచ్చన్ అనే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపించాడు. మాస్ మహారాజాకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. ఊరిలో ఆర్కెస్ట్రా పెట్టి నవ్వులు పూయించే మిస్టర్ బచ్చన్.. రంగంలోకి దిగితే ఎంతటి వాడికైనా దేత్తడి పోచమ్మ గుడే అని ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు.

Advertisement

ఇక బచ్చన్ కు ఒక బిగ్ షాట్ ఇంట్లో రైడ్ చేయమని అధికారులు ఆదేశిస్తారు. ఇక ఆ రైడ్ వలన బచ్చన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఇక జక్కికి బచ్చన్ కు ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హిందీలో హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కించారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, హరీష్ ఆ వార్తలను కొట్టిపడేశాడు. కేవలం ఆ లైన్ మాత్రమే తీసుకొని మిస్టర్ బచ్చన్ ను తెరకెక్కించినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ఇక చివర్లో రవితేజ.. అమితాబ్ ఫ్యాన్ అని అనిపించుకున్నాడు. ఆగస్టు 15 న షోలే రిలీజ్ అయ్యి ఏ రేంజ్ హిట్ అయ్యిందో గుర్తుచేసి .. అదే రోజు తన సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పకనే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×