BigTV English

Masthan Sai Arrest : న్యూ*డ్ వీడియోలు… మస్తాన్ అరెస్ట్… ఆ వీడియోలు ఎలా తీశారంటే..?

Masthan Sai Arrest : న్యూ*డ్ వీడియోలు… మస్తాన్ అరెస్ట్… ఆ వీడియోలు ఎలా తీశారంటే..?

Masthan Sai Arrest : లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అతనితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.


గత ఏడాది రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన లావణ్య.. తాజాగా మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో మస్తాన్ సాయి, అతని సన్నిహితుడు ఖాజాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మస్తాన్ సాయిపై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేసి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. రెండు సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్, రెండు హర్డ్ డిస్క్ లు సీజ్ చేశారు.

గత కొన్నాళ్లుగా ఏపీ, తెలంగాణ అమ్మాయిలే టార్గెట్ గా మస్తాన్ సాయి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ మాట్లాడినట్టు సైతం పోలీసులు గుర్తించారు. ఫోన్లో పలువురు అమ్మాయిల ప్రైవేటు వీడియోలను గుర్తించిన పోలీసులు.. చివరికి వారందరినీ మస్తాన్ సాయి బెదిరిస్తున్నట్టు గుర్తించారు.


ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కేసులో సైతం మస్తాన్ సాయి పలు ఆరోపణలు ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈ రోజు గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్పెషల్ పోలీసుల అదుపులో ప్రస్తుతం మస్తాన్ సాయి ఉన్నట్టు సమాచారం. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు జరిపిన సబ్ పోలీసులు మస్తాన్ సాయిను గుర్తించారు. అయితే ఆ సమయంలో పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. అప్పటి నుంచి మస్తాన్ సాయిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఎట్టకేలకు గుంటూరులో పట్టుకున్నారు. లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంలో సైతం మస్తాన్ సాయి పేరు ఎక్కువగా వినిపించింది. తన ఇంటికి వచ్చి మస్తాన్ సాయితో పాటు ఖజా బెదిరించాడని.. చంపేస్తామని హెచ్చరించారని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరిపై మరింత ఫోకస్ పెట్టి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

ALSO READ :  న్యూ*డ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. టాప్ రేటింగ్ లో త్రిష మూవీ

మస్తాన్ సాయి ఫోన్ లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతని వద్ద నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్న హార్డ్ డిస్క్ లో ఎందరో మహిళలకు తెలియకుండా తీసిన వందలాది న్యూడ్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో కొంతమంది పెళ్లయిన మహిళలు ఉండగా.. మరి కొంతమంది పెళ్ళికాని మహిళలు ఉన్నట్టు సమాచారం. వీరందరీ ప్రైవేట్ వీడియోస్ ఈ హార్డ్ డిస్క్ లో భద్రపరిచాడు మస్తాన్ సాయి.

అంతేకాకుండా హ్యాక్ చేసి స్టోర్ చేసుకున్న ఎన్నో ప్రైవేట్ వీడియోస్ ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. గూగుల్ అకౌంట్, గూగుల్ ఫొటోస్, ఐ క్లౌడ్ అకౌంట్స్ తన స్వాధీనంలో పెట్టుకొని మహిళలను బెదిరించినట్లు సమాచారం. కుటుంబ పరువు పోతుందని, ఎదురుతిరిగితే ఏమవుతుందోననే భయంతో, మస్తాన్ సాయి తమ జీవితాన్ని నాశనం చేస్తాడనే భయంతో ఎందరో ఆడపిల్లలు ఈ విషయాన్ని మౌనంగా భరించారు. ఇందులో ఉన్న ఏ మహిళ కూడా అతనికి ఎదురు తిరగలేదు. ఆపై మహిళలకు కోరికలు పెంచే డ్రగ్స్ ఇస్తూ తన కోరికలు తీర్చుకుంటూ వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్నాడు. ప్రతి అమ్మాయి దగ్గర ఒక డ్రామా ప్లే చేస్తూ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఆపై తానే తప్పు చేశానంటూ క్షమించమంటూ ఉరి వేసుకుంటానని బెదిరిస్తూ తీసుకున్న వీడియోలు సైతం రికార్డ్ చేశాడు. వందల కొద్ది వీడియోలు, వేల కొద్ది ఫోటోలతో అతను చేసిన నేరాలు అన్నీ ఆ హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్నాడు. లాయర్లతో పాటు వ్యవస్థలను సైతం మేనేజ్ చేస్తూ వాళ్లు మాట్లాడే ఆడియోలను సైతం రికార్డ్ చేసిన మస్తాన్ సాయి ఎందరో అమాయకుల జీవితాలతో ఆడుకున్నాడు.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×