BigTV English
Advertisement

Identity: న్యూ*డ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. టాప్ రేటింగ్ లో త్రిష మూవీ

Identity: న్యూ*డ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. టాప్ రేటింగ్ లో త్రిష మూవీ

Identity: ఓటీటీ.. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం దీనివైపే చూస్తోంది. మినిమమ్ బడ్జెట్ తో ఒక సినిమా తీసినా.. వెబ్ సిరీస్ తీసినా  హిట్ అయ్యింది అంటే చాలు. నిర్మాతకు డబ్బులు, డైరెక్టర్ కు పేరు వచ్చేస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఓటీటీ వైపే చూస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ అయినా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. అందుకు కారణం.. కథ, కథనం బావున్నా.. ఆ టైమ్ కు వేరే పెద్ద సినిమా రావడం.. డబ్బింగ్ సినిమాలు అయితే ఓటీటీకి వచ్చాకా చూద్దాంలే అని ప్రేక్షకులు అనుకోవడం.. ఇలా ఎన్నో సినిమాలు థియేటర్ లో అంతంతమాత్రంగా ఉన్నా ఓటీటీలో  మాత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా అలా థియేటర్ లో అంతంత మాత్రంగా ఆడిన ఒక సినిమా ఓటీటీ టాప్  ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ సినిమానే ఐడెంటిటీ.


మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్  కీలక  పాత్రల్లో నటించిన సినిమా ఐడెంటిటీ. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే డబ్బింగ్ సినిమా కావడంతో థియేటర్ లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు  పోయిందో కూడా ఎవరికి తెలియదు. అంతే కాకుండా  థియేటర్ లో రిలీజ్ అయినా నెక్స్ట్ డేనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా IMDB రేటింగ్ లో కూడా 9 అందుకొని టాప్ ట్రెండింగ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మరి ఐడెంటిటీ కథ ఏంటి.. ? అనేది తెలుసుకుందాం.

అమర్ ఫెలిక్స్ ఒక క్రిమినల్.  షాపింగ్ మాల్స్ లో అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు వీడియోలు తీసి వారిని బెదిరించి డబ్బులు గుంజుతుంటాడు.  అంతేకాకుండా అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారికి తెలియకుండా రేప్ చేసి ఆ వీడియోలను అమ్మే గ్రూప్ లో ఒకడిగా ఉంటాడు. అలా ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తుండగా.. అతడి డెన్ లోనే కాల్చి చంపబడతాడు. అయితే అతను బెంగుళూరు పరిసరాలలో హత్యచేయబడడంతో అతని వస్తువులను బెంగుళూరు పోలీసులు సీజ్ చేస్తారు.


Supritha Naidu: డ్రగ్ పెడ్లర్ ఆత్మహత్య.. టైగర్ అంటూ సురేఖవాణి కూతురు పోస్ట్ వైరల్

కేరళ నుంచి వచ్చిన అలెన్ జాకబ్(వినయ్ రాయ్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ కేసులో ప్రత్యేక్ష సాక్షి అలీషా(త్రిష) ఆమె హత్య చేసినవారిని చూసి తిరిగివస్తుండగా పెద్ద యాక్సిడెంట్ అవవడంతో ఆమె తలకు గాయం అయ్యి ఫేస్ బ్లర్ నెస్ కు గురి అవుతుంది. ఇక  ప్రత్యేక్ష సాక్షికి హంతకుడి నుంచి ప్రాణహాని ఉందని అలెన్ ఆమెను ఒక సేఫ్ హౌస్ కు తీసుకెళ్తాడు. ఆ  బిల్డింగ్ లోనే అలెన్ కు హరన్ శంకర్( టోవినో థామస్) పరిచయమవుతాడు. హరన్ స్కెచ్ ఆర్టిస్ట్ కావడంతో.. అలీషా చూసిన హంతకుడు ఫోటోను గీయించమని అడుగుతాడు. దానికి హరన్ కూడా ఓకే అని  హంతకుడు స్కెచ్ వేస్తాడు.

ఇక  స్కెచ్ ను పట్టుకొని నిందితుడును వెతుకుతున్న సమయంలో హరనే ఈ హత్య చేసినట్లు అలెన్ తెలుసుకుంటాడు. అసలు హరన్ ఎవరు.. ? అలీషా చూసింది హరన్ నేనా.. ? అలెన్ మంచివాడా.. ? కదా.. ? ఎందుకు అమర్ ను హరన్ చంపాడు.. ? వీరి మధ్యలోకి వచ్చిన సుప్రియ ఎవరు.. ? అనేది  సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా అంతా ట్విస్టులతోనే  తెరకెక్కించారు డైరెక్టర్స్. ఒక పోలీస్ అధికారిని నమ్మి  ప్రభుత్వం అప్పజెప్పిన పనిని అతను ఎలా దుర్వినియోగం చేసాడు.. ? అనేది చూపించారు. పగ, ప్రతీకారం తో పాటు ఎమోషన్స్ ను కూడా చూపించారు.

ఇక సైంటిపిక్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా వివరించారు. ఫేస్ బ్లైండ్ నెస్ కథతో తెలుగులో సుహాస్ ప్రసన్నవదనం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో త్రిష వ్యాధి కూడా అదే కావడంతో.. ఆ సినిమా చూసినవారికి త్రిష పడుతున్న బాధ అర్ధమవుతుంది. ఇక ఒక జర్నలిస్ట్ గా నిజాన్ని వెలికితీయడం కోసం అలీషా ఎంతకైనా తెగించే తెగింపు, చెల్లి కోసం ఒక అన్న  పడిన వేదన అద్భుతంగా చూపించారు.

ఇక మలయాళ సినిమాలు అంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తాయి. ఇది కూడా అందుకు అతీతమేమి కాదు.  అలెన్ రావడం.. హరన్ సైలెంట్ గా ఏదో చేయడం.. త్రిష అసలేమీ మాట్లాడకుండా సైలెంట్ గా కనిపించడం ఇవన్నీ ప్రేక్షకుడిని బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. ఇక అలెన్ కు నిజం తెల్సిన దగ్గరనుంచి కథ కొద్దిగా ముందుకు సాగుతుంది.  హరన్ గురించి నిజం తెలిసినా అలీషా ఎందుకు చెప్పలేదు అనేదానికి  వివరణ ఇవ్వడం.. అసలు హరన్ ఎవరు అని తెలిసాకా ప్రేక్షకులకు మతులు చెడతాయి. టోటల్ గా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా  ప్రేక్షకులను ఓటీటీలో బాగా మెప్పించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏ సినిమా లేకపోతే ఐడెంటిటీ మీద మీరు కూడా ఓ లుక్ వేయండి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×