E-Paper
Advertisement

Mathu Vadalara 2 Collections : మైండ్ బ్లాక్ చేస్తున్న ‘మత్తు వదలరా 2’.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Mathu Vadalara 2 Collections : మైండ్ బ్లాక్ చేస్తున్న ‘మత్తు వదలరా 2’.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

Mathu Vadalara 2 Collections : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా శ్రీ సింహ ప్రధాన పాత్రలో వచ్చిన మత్తు వదలరా 2 సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకోవడం మాత్రం కాదు ఓపెనింగ్స్ ను బాగా రాబట్టింది.. సెప్టెంబర్ 13 న సినిమా రిలీజ్ అవ్వగా మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. నాలుగు రోజులకు గాను ఎన్ని కోట్లు రాబాట్టిందో ఒకసారి చూసేద్దాం..

యంగ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ చెర్రీ నిర్మాతగా వ్యవహరించారు.. సత్య, శ్రీ సింహా కోడూరి, అజయ్, సునీల్, ఫరియా అబ్దుల్లా తదితరులు నటించారు. సత్య కామెడీతో కడుపుబ్బా నవ్వించేసాడనే టాక్ ను అందుకున్నాడు. మొత్తంగా సినిమా హిలేరియస్ ఉంది. మొదటి రోజు 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత ఆడియెన్స్ నుంచి డిమాండ్ ఉండటంతో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ మూవీకి అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు అంతకు మించి రాబట్టింది..

Advertisement

గతంలో భారీ విజయాన్ని అందుకున్న మత్తు వదలరా సినిమాకు స్వీక్వెల్‌గారూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో సుమారుగా 9 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాదాపు 10 కోట్ల షేర్‌ను అందుకుంది. ఇక నాలుగు రోజుల కలెక్షన్స్ చూస్తే..

మొదటి రోజు.. తెలుగు రాష్ట్రాలు, కన్నడ లో కలిపి 2.20 కోట్ల రూపాయలు నికరంగా, రెండో రోజు.. 3.2 కోట్లు, మూడో రోజు 3.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 8.2 కోట్లను అందుకుంది. మూడో రోజు.. 3 రోజుల్లో 16.2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాదాపు ఈ సినిమా మూడో రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ఇక నాలుగో రోజు కూడా అస్సలు తగ్గలేదు.. నిన్నటిగాను మరో 3 కోట్లకు పైగా రాబట్టిందని తెలుస్తుంది. దాదాపు నాలుగు రోజులకు గాను రూ. 20 కోట్లకు పైగా వసూల్ చేసిందనే టాక్ ను అందుకుంది. ఇప్పటిలో కొత్త సినిమాలు లేవు. దేవర వచ్చేవరకు ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వీకెండ్ కొత్త సినిమాలు లేక పోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీ సింహ హీరోగా వచ్చిన మత్తు వదలరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వచ్చిన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు వరుసగా క్యూ కడుతున్నారు. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంత ఉందొ తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×