BigTV English

Johnny Master Case : మాస్టారు గారి లీలలు.. సపోర్ట్ చేసే వాళ్లు… వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళే..

Johnny Master Case : మాస్టారు గారి లీలలు.. సపోర్ట్ చేసే వాళ్లు… వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళే..

Johnny Master Case.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న జానీ మాస్టర్ (Johnny Master) పై తాజాగా లైంగిక ఆరోపణలు సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. తనపై అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించాడని, చెప్పిన మాట వినకపోతే సెట్స్ లో బూతులు తిట్టేవాడని, దీనికి తోడు మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని హింసించాడని, అంతేకాదు ఆయన భార్య కూడా తన భర్తను వివాహం చేసుకోమని టార్చర్ పెట్టింది అంటూ బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. జరిగిన సంఘటన నార్సింగి పరిధిలోకి రావడంతో రాయదుర్గం పోలీసులు.. నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఈ కేసుకు సంబంధించి జీరో ఎఫ్ ఐ ఆర్ ను బదిలీ చేశారు.


విచారణలో విస్తుపోయే నిజాలు..

కేసు నమోదు చేసుకున్న సిఐ హరికృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణల రీత్యా.. విచారణ చేపడుతున్నాము. బాధిత యువతిని ఆమె ఇంటిలోనే దాదాపు మూడు గంటల పాటు విచారించగా విస్తుపోయే నిజాలు ఆమె బయట పెట్టింది. జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడని, క్యారవాన్ లో కూడా చాలాసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది. త్వరలోనే జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటాం అంటూ సీఐ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు. ఇకపోతే మాస్టారు గారి లీలలు బయటపడడంతో కొంతమంది సెలబ్రిటీలు ఈయనకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొంతమంది ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ పెడుతున్నారు. మరి జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచిన సెలబ్రిటీలు అలాగే ఈయనను వ్యతిరేకిస్తున్న సెలబ్రిటీలు ఎవరో కూడా మనం ఇప్పుడు చూద్దాం.


జానీ మాస్టర్ ను వ్యతిరేకిస్తున్న సెలబ్రిటీస్ వీళ్లే..

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై తాజాగా స్పందించిన ప్రముఖ సింగర్ చిన్మయి.. బాధిత యువతి మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోరాడడానికి ఆమెకు మరింత శక్తి కావాలని కోరుకుంటున్నాను అంటూ.. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరింది. అలాగే ప్రముఖ హీరోయిన్ పూనమ్ కవర్ కూడా.. ఇకపై షేక్ జానీ ని ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి అంటూ కామెంట్లు చేసింది. వీరితోపాటు..

Johnny Master Case : Master Gari Leelas.. Those who support... Those who oppose..
Johnny Master Case : Master Gari Leelas.. Those who support… Those who oppose..

జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచిన స్టార్ సెలబ్రిటీస్ వీళ్లే..

జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చిరంజీవిని మొదలుకొని రామ్ చరణ్ వరకు చాలామంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వ్యక్తిపై ఒక బాధిత యువతి ఇంత పెద్ద కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అమ్మాయికి మద్దతుగా నిలవడం పోయి చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు సైలెంట్ గా ఉంటూ జానీ మాస్టర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, కోలీవుడ్ హీరో విజయ్, యంగ్ హీరో రామ్ పోతినేని, ఎన్టీఆర్, రవితేజ వంటి దిగ్గజ స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు జానీ మాస్టర్. అయితే వీరంతా కూడా ఈ విషయంపై స్పందించకుండా మౌనంగా ఉంటూ జానీ మాస్టర్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. వీరితో పాటూ పూజా హెగ్డే, రష్మిక మందన్న, శృతిహాసన్, హెబ్బా పటేల్, అమలాపాల్, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. మొత్తానికి అయితే వీరంతా సైలెంట్ గా ఉంటూ జానీ మాస్టర్ కి మద్దతుగా నిలవడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×