E-Paper
Advertisement

Max Movie Teaser: కిచ్చా సుధీర్ ఊర మాస్ అవతార్.. మ్యాక్స్ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంతే

Max Movie Teaser: కిచ్చా సుధీర్ ఊర మాస్ అవతార్.. మ్యాక్స్ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంతే
Advertisement

Max Movie Teaser: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని, సమంత జంటగా నటించిన ఈగ సినిమాతో విలన్ గా తెలుగువారికి పరిచమయ్యాడు సుదీప్. మొదటి సినిమాలో విలన్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆయనను బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత సుదీప్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న సుదీప్.. ప్రస్తుతం మ్యాక్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ కలైపులి ఎస్ థాను & కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సునీల్ విలన్ గా కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

ఇప్పటికే మ్యాక్స్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గగ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మ్యాక్స్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఊర మాస్ అవతార్ లో సుదీప్ కనిపించాడు. బా బా బ్లాక్ షీప్ రైమ్ పాడుతూ కథను చెప్పుకొచ్చాడు. విలన్స్ ఎవరు.. వారిని హీరో ఏం చేశాడు.. అనేది చూపిస్తూ చివర్లో ఉగ్ర తాండవం చేస్తున్నట్లు రెండు కత్తులతో సుదీప్ విలన్స్ ను ఏకిపారేస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది.

ఇక ఈ సినిమాకు బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ తోనే సినిమాపై ఒక హైప్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా సునీల్ ఈ సినిమా ద్వారా కన్నడలో అడుగుపెడుతున్నాడు. సుదీప్ లాంటి స్టార్ హీరోకు విలన్ గా చేయడం అంటే మాములు విషయం కాదు. దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సుదీప్ కు ఎలాంటి విజయాన్ని అందివ్వనుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×