E-Paper
Advertisement

Mechanic Rocky: గుల్లేడు గుల్లేడు సాంగ్ కు గులామ్ అయ్యేలా ఉన్నామే.. అదిరిపోయింది

Mechanic Rocky: గుల్లేడు గుల్లేడు సాంగ్ కు గులామ్ అయ్యేలా ఉన్నామే.. అదిరిపోయింది
Advertisement

Mechanic Rocky: కుర్ర హీరో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంకా నాతో ఉంటడే అంటూ సాగిన ఈ సాంగ్ చూడడానికే కాదు వినడానికి కూడా ఎంతో వినసొంపుగా ఉంది. స్నేహితుల పెళ్ళిలో హీరోహీరోయిన్లు సందడి చేసే సమయంలో వచ్చే సాంగ్ లా అనిపిస్తుంది.

Advertisement

హీరో గురించి.. హీరోయిన్ తన మనసులోని భావాలను బయటపడుతున్నట్లు లిరిక్స్ ను బట్టి అర్ధమవుతుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ అన్ని ఒక్క ఎత్తు అయితే.. మంగ్లీ వాయిస్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇక మీనాక్షీ అందం సాంగ్ మొత్తానికి హైలైట్ గా మారింది.

యష్ మాస్టర్ కొరియోగ్రఫీ.. విశ్వక్- మీనాక్షీ కెమిస్ట్రీ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మొదటి సాంగ్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఇకపొతే ఈ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×