BigTV English

CM Chandrababu : గత ప్రభుత్వం నేతన్నలకు అన్యాయం చేసింది : సీఎం చంద్రబాబు

CM Chandrababu : గత ప్రభుత్వం నేతన్నలకు అన్యాయం చేసింది : సీఎం చంద్రబాబు

CM Chandrababu Speech updates(AP political news): గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, నేతన్నలకు అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులను ఇచ్చిందని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ సర్కార్ అన్ని వ్యవస్థలను దోపిడీ చేసిందని, చట్టంలో ఉన్న అన్ని లొసుగులను వాడుకుని దోచుకున్నారని ఆరోపించారు.


నేతన్న హస్తం అని చెప్పి.. వారికి ఉన్న మిగతా పథకాలన్నింటినీ రద్దు చేసిందని దుయ్యబట్టారు. ఇప్పుడు నేతన్నలకు తాను ఉన్నానన్న భరోసా ఇచ్చేందుకు వచ్చాని సీఎం తెలిపారు. ఈ ఐదేళ్ల పాలనలో బీసీ సబ్ ప్లాన్ కు లక్షా 50 వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తామన్నారు. నేతన్నలు అడిగిన దానికంటే ఎక్కువే ఇవ్వాలని తనకు ఉంది కానీ.. ఖజానా దివాలా తీసిందని, అందుకే చేయలేకపోతున్నానన్నారు. అన్ని సమస్యలు తీరాక నేతన్నలకు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చానన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రానికి రోడ్లు, కరెంట్, సంపద ఏది వచ్చినా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతోనే వస్తుందని తెలిపారు. ప్రతీ ఏటా చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచే బాధ్యత తమదని పేర్కొన్నారు చంద్రబాబు. P4 విధానాన్ని తీసుకొచ్చి సంపద సృష్టించేందుకు కృషి చేస్తామన్నారు. రోజుకు రూ.200 సంపాదించలేనివారికి అండగా నిలబడతామని తెలిపారు. మళ్లీ జన్మభూమి వంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.


రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టి జరగాలని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆ ఆదాయంతో పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తే.. ఈ సమయానికి రూ.3 లక్షల కోట్ల సంపద వచ్చిందని, గత ప్రభుత్వ దుర్మార్గంతో ఆ సంపదంతా ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×