BigTV English

Mega Hero : మెగా ఫ్యాన్స్ అప్‌సెట్… ‘కింగ్ డమ్‌’ను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా..?

Mega Hero :  మెగా ఫ్యాన్స్ అప్‌సెట్… ‘కింగ్ డమ్‌’ను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా..?

Mega Hero : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న మూవీ కింగ్ డమ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో విజయ్ దేవరకొండ భయంకరంగా కనిపిస్తున్నాడు. తాజాగా టైటిల్ ను, టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో పవర్ ఫుల్ డైలాగులతో పాటుగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉండటంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చూస్తుంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొనేలా ఉన్నాడు. మే లో సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీని డైరెక్టర్ ముందుగా మెగా హీరోతో చేద్దామని అనుకున్నాడట.. ఆయన నో చెప్పడంతో ఆ మూవీ విజయ్ దగ్గరకు వచ్చిందని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఆ మెగా హీరో ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసుకుందాం..


న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెలుగులో ‘జెర్సీ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ను రామ్‌ చరణ్‌తో చెయ్యాల్సి ఉంది.. గతంలో రామ్ చరణ్ తో 16 వ సినిమా రాబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. అందుకు కారణం గౌతమ్‌ హిందీలో రీమేక్‌ చేసిన జెర్సీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాకపోవడమేనని ప్రచారం జరిగింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. అలాగే స్క్రిప్ట్‌ విషయంలో చరణ్‌ సంతృప్తిగా లేకపోవడంతో ప్రాజెక్ట్‌ను ఆపేశారని ఓ వార్త వినిపించింది. అది కూడా రూమర్స్ అనే తేలింది. ఈ సినిమా కోసం నెలలు తరబడి గౌతమ్ స్క్రిప్ ను రెడీ చేసినట్లు తెలుస్తుంది. స్టోరీని రామ్ చరణ్ కు వినిపించాలని అనుకున్నాడట అయితే చరణ్ మాత్రం చిరంజీవికి వినిపించాలని చెప్పడంతో ఆయనకు కూడా ఆ స్క్రిప్ట్‌ను వినిపించారు. కానీ, చిరంజీవికి ఈ కథ నచ్చలేదు.. దాంతో ఈ సినిమాని పక్కన పెట్టేశారు..

ఇక రామ్ చరణ్ బుచ్చిబాబుతో తన 16వ సినిమాని అనౌన్స్ చేశారు. అలా ‘కింగ్‌డమ్‌’ అనే సినిమా విజయ్‌ దేవరకొండ వరకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. విజయ్ లుక్ చాలా బాగుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈమధ్య విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన హిట్ లేదు. విజయ్‌కి ‘కింగ్‌డమ్‌’ మంచి బ్రేక్‌ ఇస్తుందని ప్రచారం ఇండస్ట్రీలో   జరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ చూస్తుంటే చాలా బిగ్‌ రేంజ్‌ సినిమాలా కనిపిస్తోంది. సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌గానీ, బ్యాక్‌డ్రాప్‌గానీ, ఎమోషన్స్‌ అన్ని కూడా రాజమౌళి ప్రశాంత్ నీల్ సినిమాల లాగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు.. ఏది ఏమైనా రామ్ చరణ్ ఈ సినిమాని మిస్ చేసుకుని పెద్ద తప్పే చేశాడని మెగా ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీని  శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.  ఇకపోతే మే 30 న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తన 16వ సినిమా బుచ్చిబాబుతో చేస్తున్నారు.. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×