Allu Sneha Reddy: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీల పరిస్థితి దారుణంగా తయారయ్యింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక సెలబ్రిటీ సోషల్ మీడియా వచ్చాకా మనశ్శాంతిగా పర్సనల్ లైఫ్ ను గడపలేకపోతున్నాడు. పార్టీలో మందు తాగితే తప్పు.. బయట సిగరెట్ తాగితే తప్పు.. భార్యాబిడ్డలతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేయకపోతే తప్పు.. ఇలా ఏది జరిగినా విమర్శలు వెల్లువెత్తి.. పర్సనల్ లైఫ్ ను స్పాయిల్ చేయడానికి రెడీగా ఉంటున్నారు ట్రోలర్స్. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుంతుందా.. ? ఏకిపారేద్దాం అని కాచుకు కూర్చుంటున్నారు కొందరు.
అసలు ఈ సోషల్ మీడియాకు అంటూ ఒక లిమిట్ లేదా.. ? ఇది లేనప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉండేది.. ? ఇలాంటి ఆలోచనలకు ఒక సమాధానం చెప్పుకొచ్చింది అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి. గత కొంతకాలంగా అల్లు కుటుంబంలో ఎన్ని వివాదాలు తలెత్తాయో అందరికీ తెల్సిందే. సాధారణంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ తోనే చంపేస్తూ ఉంటారు. మా హీరో గొప్ప.. మీ హీరో వేస్ట్ అంటూ ఇష్టమొచ్చిన మాటలతో ఏకిపారేస్తూ ఉంటారు. అలాంటివి అల్లు అర్జున్ కూడా ఎదుర్కుంటూ వస్తూనే ఉన్నాడు.
గతేడాది నుంచి ఆ ట్రోల్స్ మరింత పెరిగాయి. బన్నీ.. జనసేనకు అన్యాయం చేయడం, పుష్ప 2 బెన్ ఫిట్ షోకు వెళ్లడం.. అక్కడ తొక్కిసలాట.. రేవతి అనే మహిళ చనిపోవడం, కేసు అవ్వడం, జైలుకు వెళ్లడం.. సోషల్ మీడియాలో బన్నీని దారుణంగా ట్రోల్ చేయడం.. ఇలా ఒకటి అని కాదు.. ఎన్నో విమర్శలు.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయింది అల్లు నిలయం. కేవలం బన్నీని మాత్రమే కాకుండా అతని కుటుంబాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
Samantha: సమంతలో కొత్త మార్పు గమనించారా.. ఇది కదా కావాల్సింది
ఇక ఇదంతా చూసిన స్నేహకు మనసు విరిగిందో.. లేక తన భర్తపై వస్తున్న విమర్శలను చదివిందో తెలియదు కానీ.. సడెన్ గా సోషల్ మీడియాకు కూడా ఒక లిమిట్ ఉంటే బావుంటుందని చెప్పుకొచ్చింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా లేని లైఫ్ ఎలా ఉండేదో చెప్తూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ” సోషల్ మీడియా కూడా ప్రతి షాప్ లా సాయంత్రం 6 గంటలకే మూసివేస్తే ఎలా ఉంటుంది. మనమందరం నిజ జీవితంలో ఒకరినొకరు కలుసుకోవడానికి, మాట్లాడటానికి సమయం ఉండేది. మన కుటుంబాలతో కలిసి ఉండేవాళ్ళం.. చదువుకోవడం, సంగీతం వినేవాళ్లం.. కళలు నేర్చుకొనేవాళ్లం” అంటూ చెప్పుకొచ్చింది.
స్నేహరెడ్డి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సడెన్ గా ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక కారణం ఏంటి అనేది ఆరాలు తీస్తున్నారు. నిజంగానే స్నేహా.. ఈ పోస్ట్ అల్లు అర్జున్ పై వస్తున్న ట్రోల్స్ గురించే పెట్టిందా.. ? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది. పుష్ప 2 తరువాత బన్నీ.. కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఈ వివాదాలతో విసిగిపోయిన అల్లు కుటుంబం వెకేషన్స్ తో బిజీగా మారింది. కొన్ని నెలలు బన్నీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. పిల్లలతో కలిసి సమయం కేటాయించాలనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.