BigTV English
Advertisement

Pushpa2 vs Mega Fans : ‘పుష్ప 2 ‘ పై మెగా ఫ్యాన్స్ కుట్ర.. ఇలా తయారయ్యారెంట్రా బాబు..

Pushpa2 vs Mega Fans : ‘పుష్ప 2 ‘ పై మెగా ఫ్యాన్స్ కుట్ర.. ఇలా తయారయ్యారెంట్రా బాబు..

Pushpa2 vs Mega Fans : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2.. మరో ఐదు రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు అల్లు అర్జున్.. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ఐటమ్ సాంగ్ ఈవెంట్ లోను, నిన్న కొచ్చి ఈవెంట్ లోను అల్లు అర్జున్ మాత్రమే ప్రమోషన్స్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 టీం సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాను ప్లాప్ అయ్యేలా చెయ్యాలని కుట్ర చేస్తున్నారని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం వైరల్ గా మారింది.


ఈ ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని అల్లు అర్జున్ సపోర్ట్ చేసాడు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గు మనేది.. ఇక వీరి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరి మధ్య అంతగా గొడవలు జరిగినట్లు కనిపించలేదు కానీ ఫ్యాన్స్ వార్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాను ప్లాప్ అయ్యేలా చెయ్యాలని మెగా ఫ్యాన్స్ చూస్తున్నారట. తాజాగా సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యాన్స్ మాట్లాడిన ఒక ఆడియో నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఇంతకీ ఆ ఆడియో క్లిప్ లో ఏముందంటే.. వీపీఎన్‌ ద్వారా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని, అందులో సినిమా బాలేదని చెబుతానని ఓ అభిమాని చెప్పడం జరిగింది. వీపీఎన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఐపీ అడ్రస్ ఎవరికి దొరకమని చెప్పుకోవడం ఈ ఆడియో కాల్ రికార్డింగ్‌లో వినిపించింది. దీనిపై అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. మీకు అంత దమ్ము ఉంటే ఆచార్య ఎందుకు హిట్ చేసుకోలేక పోయారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మీ పంతం నెగ్గించుకోవాలని ఇంతకు తెగించారా అని కామెంట్స్ కూడా నెటిజన్లు చేస్తున్నారు. ఈ ఆడియో క్లిప్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది.


ఇక పుష్ప 2 భారీ అంచనాలతో డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప-2 సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాకు సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ మూవీ రన్ టైమ్ కూడా 3 గంటల 20 నిముషాలు ఉంది. ఇంత భారీగా ఉండటంపై చర్చ జరుగుతోంది. అయితే పార్టు-1 కూడా 3గంటలకు పైగానే ఉంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పార్టు-2కు ఉంటే బెస్ట్ అని నిర్మాతలు అంటున్నారు. మరి అంత టైం తో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×