Tips For White Skin: చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. అంతే కాకుండా చర్మం రంగు కూడా మారుతుంది. ఇలాంటి సమయంలోనే స్కిన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం.
గసగసాలు సహజమైన స్క్రబ్బింగ్ ఏజెంట్. ఇవి మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి.
గసగసాలతో తయారుచేసిన స్క్రబ్ శీతాకాలంలో ముఖాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇంట్లో తయారుచేసిన గసగసాల స్క్రబ్ ముఖంపై మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు మెరిసేలా చేస్తుంది. చాలా మంది మార్కెట్‌లో లభించే స్క్రబ్‌లను వాడతారు. గసగసాలతో స్క్రబ్‌ను చాలా తక్కువ బడ్జెట్‌లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గసగసాల నుండి తయారు చేసే 4 రకాల స్క్రబ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. గసగసాలు, పెరుగుతో స్క్రబ్:
కావల్సినవి:
గసగసాల పేస్ట్ – 2 టీస్పూన్లు
పెరుగు- 4 టీస్పూన్లు
తయారీ విధానం: పెరుగుతో గసగసాల పేస్ట్ కలిపి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత 10 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేయడంలో ఈ స్క్రబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. గసగసాలు, తేనెతో స్క్రబ్:
కావల్సినవి:
గసగసాల పేస్ట్ – 2 టీస్పూన్లు
తేనె- 1 టీస్పూన్
తయారీ విధానం: గసగసాల పేస్ట్‌లో తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ స్క్రబ్ చర్మాన్ని తేమగా మారుతుంది. అంతే కాకుండా మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.
3. గసగసాలు, నిమ్మరసంతో స్క్రబ్:
కావల్సినవి:
గసగసాల పేస్ట్ – 2 టీస్పూన్లు
నిమ్మరసం- 1 టీస్పూన్
తయారీ విధానం: నిమ్మరసంలో గసగసాలు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ స్క్రబ్ చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గిస్తుంది. ఫలితంగా చర్మం మెరుస్తుంది.
Also Read: దీన్ని ఒక్క సారి వాడినా చాలు.. తెల్లగా మెరిసిపోతారు
4. గసగసాలు, టమాటోతో స్క్రబ్:
కావల్సినవి:
గసగసాల పేస్ట్
టమాటో గుజ్జు- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
గసగసాల గింజలను టమాటా గుజ్జుతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ స్క్రబ్ చర్మాన్ని టానింగ్ నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.