E-Paper
Advertisement

Mega heroine Niharika : వెండితెరపై రీఎంట్రీకి మెగా హీరోయిన్ సిద్ధం..

Mega heroine Niharika : వెండితెరపై రీఎంట్రీకి మెగా హీరోయిన్ సిద్ధం..
Advertisement
Mega heroine Niharika

Mega heroine Niharika : మెగా ఫ్యామిలీ అనేది టాలీవుడ్‌లోనే ఎక్కువమంది హీరోలను వెండితెరకు పరిచయం చేసింది. ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు అందరూ ఇప్పుడు స్టార్లుగా ఇతర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇంతమంది హీరోల మధ్య మెగా ఫ్యామిలీ నుండే ఒకేఒక్క అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమయ్యింది నిహారిక కొణిదెల. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక.. మళ్లీ వెండితెరపై రీఎంట్రీకి రెడీగా ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

నాగబాబు కూతురిగా మెగా ఫ్యామిలీ నుండి పరిచయమయిన తొలి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక. ముందుగా తన ప్రయాణాన్ని బుల్లితెరపై యాంకర్‌గా ప్రారంభించి.. ప్రేక్షకులకు దగ్గరయిన తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా పరిచయమయ్యింది. హీరోయిన్‌గా నటించి కొన్ని సినిమాలే అయినా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. కెరీర్ ఫార్మ్‌లో ఉన్నప్పుడే చైతన్య జొన్నల్లగడ్డను పెళ్లి చేసుకొని యాక్టింగ్ మానేస్తున్నట్టు ప్రకటించింది.

హీరోయిన్‌గా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టినా కూడా నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్‌లు నిర్మించడం ప్రారంభించింది నిహారిక. యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి నిర్మాతగా తను విడుదల చేసిన రెండు వెబ్ సిరీస్‌లు ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో నిర్మాతగానే సెటిల్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ‘డెడ్ పిక్సెల్స్’ అనే సిరీస్‌తో నటనను మళ్లీ ప్రారంభించింది. దీంతో మళ్లీ తను వెండితెరపై అడుగుపెట్టడానికి సిద్ధమవుతుందని సినీ రంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

పెళ్లి తర్వాత నటించను అని ప్రకటించిన నిహారిక.. మళ్లీ సినిమాల్లోకి వస్తుంది అని తెలిసే సరికి తన విడాకుల గురించి వస్తున్న వార్తల్లో నిజం ఉందేమో అని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. పైగా సోషల్ మీడియాలో నిహారిక ఫోటోషూట్స్ కూడా కాస్త ఘాటుగానే మారాయి. ప్రస్తుతం తన రీఎంట్రీపై పూర్తిగా క్లారిటీ లేకపోయినా.. త్వరలోనే ఒక యంగ్ హీరోతో జోడీకట్టి ప్రేక్షకులకు పలకరించడానికి నిహారిక సిద్ధమవుతుందని వార్తలు వైరల్ అయ్యాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×