BigTV English

Mega Hero’s: మెగా కొడుకు కోసం మెగా తండ్రి త్యాగం.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

Mega Hero’s: మెగా కొడుకు కోసం మెగా తండ్రి త్యాగం.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

Mega Hero’s.. సాధారణంగా సినిమా బాక్సాఫీస్ కి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించే ఈ మూడు రోజుల సెలవు దినాలను క్యాష్ చేసుకోవడానికి బడా హీరోలు, నిర్మాతలు కూడా తెగ ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే తమ సినిమాలను విడుదల చేయడానికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మెగా హీరోలు మాత్రం ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు అనే వార్తలు తెరపైకి వచ్చాయి


సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్న చిరంజీవి..

ఇదిలా ఉండగా గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో దిగి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. బింబిసారా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాను ప్రకటించారు. భారీ అంచనాల మధ్య వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన సినిమాను విడుదల చేయాలని..ప్రాజెక్టు ప్రకటించిన తొలిరోజే విడుదల తేదీని కూడా తెలిపారు. దీంతో అభిమానులు సంక్రాంతి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో సడన్గా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కన్ఫ్యూజన్లో పడేస్తూ సినిమా తేదీని వాయిదా వేశారు. అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


సంక్రాంతి ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న రామ్ చరణ్

దీనికి తోడు కొడుకు కోసం చిరంజీవి త్యాగం చేస్తున్నారనే వార్తలు మరొకవైపు తెరపై వినిపిస్తున్నాయి
అసలు విషయంలోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల నష్టం వృధా అయినా..బడ్జెట్ విషయంలో ఆయన ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇదిలా ఉండగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. క్రిస్మస్ హాలిడేస్ ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయాలనుకున్నారు.. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఈ విడుదల తేదీని వాయిదా వేస్తూ సంక్రాంతి బరిలోకి దించబోతున్నారు.

కొడుకు కోసం తండ్రి త్యాగం..

మరొకవైపు చిరంజీవి విశ్వంభర సినిమా విఎఫ్ఎక్స్ ఇంకా పూర్తి కాలేదు . దీనికి తోడు చిరంజీవి గత నెల రోజులకు పైగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. కాబట్టి ఆయన పాల్గొనాల్సిన షూటింగ్ భాగం ఇంకా మిగిలే ఉందని , ఈ నేపథ్యంలోనే సంక్రాంతి లోపు అంటే షూటింగ్ కంప్లీట్ చేయడం కష్టం కాబట్టి ఈ సినిమాను విడుదల తేదీ వాయిదా వేసి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. ఏది ఏమైనా కొడుకు కోసం తండ్రి ఇంత పెద్ద త్యాగం చేయడాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికైతే చిరంజీవి అభిమానులు ఇప్పుడు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×