BigTV English

Viral News: ఆయన కొడుకు పేరు 1, 2, 6.. అనంతపురంవాసి వెరైటీ ఆలోచన, దాని అర్థం ఏమిటో తెలుసా?

Viral News: ఆయన కొడుకు పేరు 1, 2, 6.. అనంతపురంవాసి వెరైటీ ఆలోచన, దాని అర్థం ఏమిటో తెలుసా?

Viral News: రామ్.. రహీమ్.. రాబర్ట్.. ఇలా ఎవరైనా తమ బిడ్డకు నామకరణం చేస్తారు. నేటి ట్రెండీ కాలంలో అయితే పేర్లు కూడా ఫ్యాషన్ మోజు వైపు మారాయి. కొందరు తమ బిడ్డలకు నామకరణం చేసేందుకు పెద్ద కసరత్తు చేస్తారు.. కుటుంబసభ్యులతో పెద్ద చర్చనే సాగుతుంది. మరికొందరు తమ ఇష్టదైవాల నామం కలిసే విధంగా నామకరణం చేస్తారు తమ సంతానానికి.


కానీ ఇక్కడ ఓ తండ్రి తన బిడ్డకు చేసిన నామకరణం ఇదో వెరైటీ. ఈ పేరు పలికినా కూడా.. ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ వినలేదే అనాల్సిందే. అయితే ఈ పేరు తన బిడ్డకు నామకరణం చేయడం వెనుక ఒక లక్ష్యం ఉందంటున్నారు ఈ తండ్రి. ఇంతకు యావత్ భారతావనిలో ఇలాంటి పేరు నామకరణం చేసిన తండ్రి ఇతనే కావచ్చు.. బిడ్డ కూడా ఈ బాలుడే కావచ్చు. ఇక అసలు కథ లోకి వెళదాం.

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీ.హెచ్ రాఘవేంద్ర దంపతులకు ఒక బాబు సంతానం. అయితే అభ్యుదయ భావాలు.. సామాజిక అంశాలపై పట్టు గల రాఘవేంద్ర తన కుమారుడికి మంచి పేరు నామకరణం చేయాలని భావించారు. అది కూడా ఆ పేరు దేశభక్తిని చాటి చెప్పాలి కానీ.. ఏ కులాన్ని.. ఏ మతాన్ని ప్రతిబింబించేలా ఉండకూడదన్నది అతని అభిప్రాయం.


ఇక ఆలోచించకుండా తన బాబుకు సిహెచ్ వన్ టూ సిక్స్ అంటూ నామకరణం చేశారు. ఔను మీరు చదివింది నిజమే.. ఇదే పేరు తన బిడ్డ ఆధార్ కార్డులో కూడా నమోదు చేయించారు. ఇదేందయ్యా ఇది.. ఇట్టాంటి పేరు మేము వినలేదు.. కనలేదు.. ఎందుకు ఈ పేరు పెట్టావు అన్నవారు ఉన్నారట. అయితే ఈ పేరు వెనుక మిస్టరీ వివరించారు రాఘవేంద్ర..

అసలు అర్థం ఏమిటంటే.. వన్ అంటే ఐ, టూ అంటే యామ్, సిక్స్ అంటే ఇండియన్ అని తేల్చేశారు. అంటే ఈ బాబు పేరు ఐ యామ్ ఇండియన్ అని వచ్చేలా నామకరణం చేశారు ఆ తండ్రి. బిడ్డ పేరు గురించి రాఘవేంద్ర మాట్లాడుతూ.. తాను బాల్యంలో కులవివక్షతను సమాజంలో చూసినట్లు, అందుకే కులం, మతం ప్రభావితం కానీ పేరును తన బిడ్డకు నామకరణం చేశానన్నారు.

Also Read: New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

మనమందరం భారతీయులం.. కులాలు, మతాలు కాదు.. కరోనా కాలంలో మన కష్టాలు తెలుసుగా… ఏ దేవుడు రాలేదు.. కుల, మత భేదం లేకుండా ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇంకా ఎందరో మనకు సేవలు అందించారన్నారు. అందుకే తన బిడ్డకు నేను ఇండియన్ అనే రీతిలో నామకరణం చేసి, సమాజంలో కొంతైనా మార్పు వస్తుందేమోనన్న నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

తన బిడ్డకు ప్రభుత్వం నో క్యాస్ట్ సర్టిఫికెట్ సైతం ఇవ్వాలని రాఘవేంద్ర కోరారు. మొత్తం మీద బిడ్డకు వెరైటీ పేరు నామకరణం చేసిన ఈ తండ్రి మనసులోని భావం ఇదన్నమాట. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. వట్టిమాటలు కట్టిపెట్టు.. గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న గురజాడ మాటలకు తగినట్లుగా.. నా దేశం ఒకటే.. మనుషులందరూ ఒకటే.. అంతేకాని కులాలు లేవు మతాలు లేవు.. కేవలం మానవత్వభావనను చాటి చెప్పాలన్న ఈ తండ్రి లక్ష్యం నెరవేరాలని అందరం కోరుకుందాం.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×