E-Paper
Advertisement

Varun Tej Upcoming Movie: వరుణ్ బాబుకు మరో లవ్ ట్రాక్‌ కుదిరింది వరుణ్ తేజ్.. ఈసారైనా హిట్ కొట్టేనా?

Varun Tej Upcoming Movie: వరుణ్ బాబుకు మరో లవ్ ట్రాక్‌ కుదిరింది వరుణ్ తేజ్.. ఈసారైనా హిట్ కొట్టేనా?
Advertisement

Update on Varun Tej Upcoming Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు హిట్టు పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగానే ఒక మంచి హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ఆ తర్వాత కంచె, లోఫర్, మిస్టర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ ఇవేమి వరుణ్‌కి మంచి స్టార్డమ్ తీసుకురాలేకపోయాయి. ఆ తర్వాత ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత వెంటనే తొలిప్రేమ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కి అదరగొట్టేశాయి. అయితే ఈ సినిమాల తర్వాత మరో హిట్టు పడలేదు. ఇందులో భాగంగానే విజయపజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది.

Advertisement

ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో వచ్చాడు. ఈ మూవీపై ఫస్ట్ నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో సినిమా మంచి హిట్ కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఒక్కరికీ ఈ మూవీ ఎక్కలేదు. దీంతో బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

Also Read: వరుణ్ బాబుకు మరో కథ కుదిరింది.. ఈ సారి అయినా హిట్ కొడతాడ

Advertisement

ఇక ఆ సినిమా ఫ్లాప్‌తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే వరుణ్ మరొక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వరుణ్ సినీ కెరీర్‌లో హిట్ అయిన సినిమాలన్నీ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. కాబట్టి ఇప్పుడు అతడు ఓకే చేసిన సినిమా కూడా లవ్ నేపథ్యంలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు విక్రమ్ సిరికొండతో ఓ లవ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు విక్రమ్ ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పడంతో అది నచ్చి వరుణ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి చాలా మంది ఈ సారైనా హిట్ కొడతాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×