Big Stories

Varun Tej: వరుణ్ బాబుకు మరో కథ కుదిరింది.. ఈ సారి అయినా హిట్ కొడతాడ

Varun Tej
Varun Tej

Varun Tej: చాలా మంది హీరోలు డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తుంటారు. సినిమాలో ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సిద్ధంగా ఉంటారు.

- Advertisement -

కానీ బాక్సాఫీసు వద్ద కొన్ని సినిమాలు ఫ్లాపుగా మిగిల్చి నటుల్లో ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. అయితే ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా.. పట్టు వీడని విక్రమార్కుడిలా ఓ హీరో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఎన్ని అపజయాలు ఎదురైనా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేవరకు నిద్రపోనని అంటున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ టాల్ బాయ్ మెగా హీరో వరుణ్ తేజ్.

- Advertisement -

వరుణ్ తేజ్‌కు హిట్ పడి చాలా కాలమే అయింది. అయినా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ సినిమాల తర్వాత వరుణ్ మరొక హిట్టును చూడలేదు. ఇక గతేడాది ఎన్నో అంచనాలతో ‘గాంఢీవదారి అర్జున’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Also Read: భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. వీడియో వైరల్

ఈ సినిమా కూడా అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు వద్ద ఫ్లాపుగా మిగిలింది. ఇక ఈ ఏడాది మరొక కొత్త సినిమాతో పలకరించాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది.

ఇక భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ వరుణ్ కెరీర్‌ని తిరగరాస్తుంది అనుకుంటే.. ఇది కూడా బాక్సాఫీసు వద్ద ఫ్లాపుగా మిగిలింది. పుల్వామా దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 1న థియేటర్లలోకి వచ్చింది. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఇటీవలే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్‌కి తెచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ చేతిలో మరొక సినిమా ఉంది. కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: టీనేజ్ లో లవ్.. నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు..

ఇక ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. వరుణ్ మరొక కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. తన కెరీర్‌లో మరొక సినిమాను మేర్లపాక గాంధీతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సినిమాలను తెరకెక్కించిన గాంధీ.. వరుణ్ కోసం ఓ కొత్త స్టోరీని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అందుకు సంబంధించిన కథను ఇటీవలే వరుణ్‌కు నేరెట్ చేయగా.. స్క్రిప్ట్ నచ్చడంతో వరుణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా ఈ అప్డేట్‌తో చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వరుణ్ బాబు ఈ సారి అయినా హిట్టు కొడతాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News