BigTV English

Spirit: ప్రభాస్ తో మెగాస్టార్.. హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. ?

Spirit: ప్రభాస్ తో మెగాస్టార్.. హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. ?

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో స్పిరిట్ ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తరువాత బాలీవుడ్ కు వెళ్లిన ఆయన అక్కడ కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఈ మూడు సినిమాలు తరువాత సందీప్ నుంచి వస్తున్న చిత్రం స్పిరిట్.


ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు. అప్పుడే సినిమాపై వస్తున్న హైప్ తో  డార్లింగ్ ఫ్యాన్స్ చచ్చిపోయేలా ఉన్నారు. ఇందులో ప్రభాస్ .. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని సందీప్ రెడ్డి చెప్పుకొచ్చాడు. రేపో మాపో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సాధారణంగా సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా.. ప్రభాస్ మాత్రమే హైలైట్ అవుతాడు అనేది  అందరికి  తెల్సిన విషయమే.

ఇక స్పిరిట్ ను ఇంకాస్త హైలైట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగా.. గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటికే స్పిరిట్ కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. దీనికే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హైప్ తెచ్చుకున్నారు.  ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. స్పిరిట్ లో కీలక పాత్రల కోసం ఒక్కరు కాదు.. ఇద్దరు మెగాస్టార్స్ ను దింపుతున్నాడట.  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,మలయాళ  మెగాస్టార్ మమ్ముట్టి లతో ఇప్పటికే సందీప్ సంప్రదింపులు జరపడానికి  రెడీ అయ్యాడని తెలుస్తోంది.


చిరంజీవి అంటే సందీప్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్ ను చిరంజీవిని ఊహించుకొనే చేస్తానని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అలాంటి తన అభిమాన హీరో పాత్రను ఏ రేంజ్ లో డిజైన్ చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో నిజమెంత.. అబద్ధమెంత అనేది తెలియదు కానీ.. ఈ రూమర్స్ తోనే ఫ్యాన్స్  చచ్చిపోతున్నారు.

అసలు ఇలాంటి ఒక కాంబో కనుక వెండితెరపై వస్తే..  ఆ హైప్ తోనే పోయేలా ఉన్నాం.. అలా హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క చిరు సైతం వరుస  సినిమాలతో బిజీగా ఉన్నాడు. కథ నచ్చినా.. కీలక పాత్రలో చిరు చేస్తాడా.. ? లేదా.. ? అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయమే.

ఇకపోతే త్వరలోనే స్పిరిట్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.  అప్పటివరకు ఈ హైప్ తోనే ఫ్యాన్స్ కడుపు నింపుకుంటున్నారు. మరి ఈ రూమర్స్  నిజమైతే బావుండు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×