BigTV English
Advertisement

Vijay: శివకార్తికేయన్‌కు విజయ్ కాస్ట్‌లీ గిఫ్ట్.. చేసిన సాయం మర్చిపోలేదు

Vijay: శివకార్తికేయన్‌కు విజయ్ కాస్ట్‌లీ గిఫ్ట్.. చేసిన సాయం మర్చిపోలేదు

Hero Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మంచి మనసు గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అందుకే తమిళంలో ఆయనకు ఒక రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ విజయ్ చేసే యాక్టింగ్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ ఆయన యాటిట్యూట్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఒక చిన్న సాయం చేసినందుకు యంగ్ హీరో శివకార్తికేయన్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ మంచి మనసు గురించి మరోసారి ఫ్యాన్స్ అంతా తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.


గెస్ట్ రోల్స్ హైలెట్

ఇటీవల విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది గోట్.. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలయినా వాటిలో డిశాస్టర్‌గా మిగిలింది. కానీ తమిళ ప్రేక్షకులకు మాత్రం ఈ మూవీ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. దీంతో కలెక్షన్స్ విషయంలో కూడా ‘ది గోట్’ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఊహించని గెస్ట్ రోల్స్. త్రిష, శివకార్తికేయన్, ఎమ్ ఎస్ ధోనీ వంటివారు ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేసి అలరించారు. శివకార్తికేయన్, త్రిష్ గెస్ట్ రోల్స్ అయితే ‘ది గోట్’లో బాగా వర్కవుట్ అయ్యాయి.


Also Read: మారుతి బర్త్ డే స్పెషల్ వీడియో.. వింటేజ్ లుక్ లో డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు

క్రికెటర్ పాత్రలో

‘ది గోట్’ సినిమాలో ఐపీఎల్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ రిఫరెన్స్‌లు చాలానే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో క్రికెటర్‌గా కనిపించాడు శివకార్తికేయన్. ఒక్క సీన్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయినా కూడా శివకార్తికేయన్ స్క్రీన్‌పై కనిపించినంతసేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అయితే పిలవగానే వచ్చి తన సినిమాలో గెస్ట్ రోల్ చేసినందుకు శివకార్తికేయన్‌కు కాస్ట్‌లీ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు విజయ్. తాజగా ‘ది గోట్’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో శివకార్తికేయన్ చేతికి వాచ్ పెడుతూ కనిపించాడు విజయ్.

కలెక్షన్ల సునామీ

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘ది గోట్’లో శివకార్తికేయన్ గెస్ట్ రూల్‌లో కనిపించడానికి మరొక కారణం కూడా ఉందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో వెంకట్ ప్రభుతో కూడా తను ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ‘ది గోట్’ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపించింది. నెలరోజుల్లో రూ.460 కోట్లు రాబట్టింది. కేవలం తమిళం, ఓవర్సీస్ నుండే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. నెలరోజులు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అయిన తర్వాత ఇటీవల ఓటీటీలో విడుదలయ్యింది ఈ సినిమా. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది గోట్’ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×