E-Paper
Advertisement

Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోవడానికి ఢిల్లీకి పయనమైన చిరు కుటుంబం..

Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోవడానికి ఢిల్లీకి పయనమైన చిరు కుటుంబం..
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కిన విషయం తెల్సిందే. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ను ప్రకటించింది. చలన చిత్ర రంగంలో ఆయన చేసిన సేవకు గాను చిరుకు పద్మవిభూషణ్ గౌరవాన్ని అందించింది. ఇక చిరుతో పాటు 132 మంది ప్రముఖులను ఈ అవార్డులతో సత్కరించారు.

ఇక ఈ మధ్యనే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులను ఈ అవార్డులతో సత్కరించారు. అయితే ఆ రోజు కొన్ని కారణాల వలన చిరంజీవి ఆ వేడుకకు హాజరుకాలేకపోయాడు. దీంతో రేపు చిరుకు ఈ పద్మవిభూషణ్ ఇవ్వనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును చిరుకు అందివ్వనున్నారు. దీంతో ఈరోజే చిరు కుటుంబం ఢిల్లీకి పయనమయ్యింది.

Advertisement

చిరు ప్రైవేట్ జెట్ లో ఢిల్లీకి పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరుతో పాటు ఆయన భార్య సురేఖ.. కుమారుడు రామ్ చరణ్.. కోడలు ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే చిరుకు పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు పద్మవిభూషణ్ ఇవ్వనుంది.

చిరుకు ఈ అవార్డులు, రివార్డులు కొత్తేమి కాదు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను చిరంజీవి అందుకున్నాడు. ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు కొత్తగా పద్మవిభూషణ్ వచ్చి చేరింది. ఇక చిరు సినిమాల విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విశ్వంభర పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన.. దాన్ని ఫినిష్ చేయగానే స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×